సోనియా చేతిలో తుపాకీ చంద్రబాబే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియా చేతిలో తుపాకీ చంద్రబాబే

సోనియా చేతిలో తుపాకీ చంద్రబాబే

Written By news on Sunday, February 16, 2014 | 2/16/2014

సోనియా చేతిలో తుపాకీ చంద్రబాబే: అంబటి
హైదరాబాద్: ప్రజాగర్జనలో చంద్రబాబు సమైక్యమన్న మాటే మాట్లాడలేదని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు అంబటి రాంబాబు ఆక్షేపించారు. సోనియా గాడ్సే అయితే ఆమె చేతిలో తుపాకీ చంద్రబాబేనని అన్నారు. విభజనకు కారకులు సోనియా, కిరణ్‌, చంద్రబాబేనని దుయ్యబట్టారు. 16 నెలలు జైలులో ఉండి కూడా సోనియా మాఫియాను వైఎస్ జగన్ ఎదిరించారని తెలిపారు. అసెంబ్లీలో విభజన బిల్లుకు సహకరించింది చంద్రబాబేనని ఆరోపించారు.

సోనియా చేతిలో బాబు కీలుబొమ్మగా మారారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇచ్చింది చంద్రబాబేనని గుర్తు చేశారు. వంశపారపర్యంగా పిచ్చి లక్షణాలు ఉన్నది నారా కుటుంబానికేనని, జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. సమైక్యరాష్ట్రం కోసం బాబు ఎప్పుడైనా విప్ జారీ చేశారా అని అంబటి ప్రశ్నించారు. తన 9 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని, ఆయన హామీలను ఎవరూ నమ్మరని చెప్పారు.
Share this article :

0 comments: