వంగవీటి హత్య కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వంగవీటి హత్య కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి

వంగవీటి హత్య కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి

Written By news on Wednesday, September 10, 2014 | 9/10/2014

'వంగవీటి హత్య కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికల్లోనూ దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.  అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల గురించి మాట్లాడితే పరిటాల రవి హత్య గురించి ప్రస్తావించడం సరికాదని హితవుపలికారు. పరిటాల కేసును విచారిస్తే, టీడీపీ హయాంలో హత్యకు గురైన వంగవీటి మోహన రంగా హత్య కేసును కూడా విచారించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వంగవీటి కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మొదటి ముద్దాయి అవుతారని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని, ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు జరిగేలా చేస్తామని హెచ్చరించారు.

పరిటాల రవి హత్యను తిరగదోడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి అవుతారని మంత్రి పరిటాల సునీత ఆరోపించడాన్ని అంబటి రాంబాబు ఖండించారు. ఈ కేసు గురించి అప్పట్లో అసెంబ్లీలో చర్చించారని, వైఎస్ జగన్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని గుర్తు చేశారు. వంగవీటి రంగా హత్య తిరగదోడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయి, స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండో ముద్దాయి అవుతారని చెప్పారు. వంగవీటి హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్, చంద్రబాబు, కోడెలపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఇలాంటి రాజకీయ ఆరోపణలు రుజువు కాకపోవడం వల్లే వారు పదవుల్లో ఉన్నారని చెప్పారు. పరిటాల రవి హత్య కేసు తిరగదోడుతామని చెబుతున్న టీడీపీ నాయకులు వంగవీటి రంగా హత్య కేసుపై మళ్లీ విచారణకు సిద్ధమా అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. వంగవీటి హత్యతో పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇతర రాజకీయ హత్య కేసులను కూడా తిరగదోడేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిజాలు మాట్లాడితే మంచిదని అంబటి హితవు పలికారు.
 
Share this article :

0 comments: