
నెల్లూరు: రుణమాఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు కావోస్తున్నా ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదని విజయసాయిరెడ్డి అన్నారు.
ఫించన్లు, తెల్లకార్డులకు కోత విధించి నిజమైన లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
0 comments:
Post a Comment