
వైఎస్సార్‌సీపీపై బురద జల్లడమే
వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి
కడప: అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో 200 పైగా హామీలు గుప్పించి అధికారాన్ని దక్కించుకుని, ఇప్పుడు వాటిని మరిపించేం దుకు ప్రతిపక్ష పార్టీనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజగురువు రామోజీరావు, తోకపత్రిక దుష్ర్పచారం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ జిల్లా కడపలోని ఒక కళ్యాణ మండపంలో గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని చంద్రబాబుకు ఆత్మంటూ ఉంటే పరిశీలన చేసుకోవాలన్నారు. రూ.87వేల కోట్లు రైతుల రుణాలు, రూ.14వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాననీ, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఉచితంగా 9గంటల విద్యుత్, రైతుల స్థిరీకరణ నిధి, అర్హులందరికీ పక్కా గృహాలు, మౌలిక వసతుల కల్పన, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని చేసిన వాగ్దానాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న మండల కేంద్రాల్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేసేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు: ఉమ్మారెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు చేయకపోగా అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. రాజధాని ప్రకటన చేసిన నాడు 12 కారిడార్లు ప్రకటించారని, ఇప్పటివరకూ 36 కమిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు.
0 comments:
Post a Comment