బ్లాక్ మెయిల్ కు పాల్పడేది ఎవరో ప్రజలకు తెలుసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్లాక్ మెయిల్ కు పాల్పడేది ఎవరో ప్రజలకు తెలుసు

బ్లాక్ మెయిల్ కు పాల్పడేది ఎవరో ప్రజలకు తెలుసు

Written By news on Saturday, November 1, 2014 | 11/01/2014


విశాఖపట్నం: కోల్డ్ స్టోరేజి, డార్క్ రూమ్ లో ఉండే నాయకులు ఎవరో జిల్లా ప్రజలకు తెలుసునని విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందే నాయకులు ఎవరో కూడా ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. 
 
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్రంలో ఏ నాయకుడు తిరగని, వెళ్లని ప్రాంతాలకు వైఎస్ జగన్ వెళ్లారు. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అని అమర్నాథ్ అన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి విముక్తి చేయడంతో జిల్లాలో పార్టీకి మంచి రోజుల వచ్చాయని కార్యకర్తలు చెబుతున్నారని ఆయన తెలిపారు. 
 
వైఎస్ విజయమ్మను విశాఖ నుంచి నిలబెడితే మూడు జిల్లాలో పార్టీ విజయవకాశాలు పెరుగుతాయని అన్నవారిలో మీరు కూడా ఉన్నారనే విషయం మర్చిపోయారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. 
Share this article :

0 comments: