బంద్ పాటిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్ పాటిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్

బంద్ పాటిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్

Written By news on Saturday, August 29, 2015 | 8/29/2015


బంద్ పాటిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్
తాడేపల్లి(పశ్చిమగోదావరి): శాంతియుతంగా బంద్ పాటిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు శనివారం తెల్లవారు జామున అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెల్లవారు జామున 5 గంటల నుంచే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళగిరి పట్టణంలో బంద్ నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించి బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు 30 మంది పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Share this article :

0 comments: