ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా

ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా

Written By news on Sunday, August 23, 2015 | 8/23/2015


వీడియోకి క్లిక్ చేయండి
సుబ్బారావు తండ్రిని ఫోన్‌లో  పరామర్శించిన జగన్

ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా.. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు యత్నించిన చావలి సుబ్బారావు తండ్రి సత్యవర్థనరావును వైఎస్ జగన్‌మోహనరెడ్డి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. బొప్పన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును చూడటానికి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఫోన్‌లో వైఎస్ జగన్‌కు సుబ్బారావు విషయం తెలియపర్చగా వెంటనే స్పందించి సుబ్బారావు తండ్రితో మాట్లాడి ఓదార్చారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. హోదా వచ్చే వరకు తన పోరాటం ఆగదన్నారు. రాష్ట్ర ప్రజలు ధైర్యాన్ని కోల్పోయి తొందరపాటు చర్యలకు దిగవద్దన్నారు. త్వరలో తాను వచ్చి సుబ్బారావును చూస్తానని ఓదార్చారు. ప్రాణత్యాగానికి సిద్ధపడిన సుబ్బారావు కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: