పాక్ ప్రధానిగా రాజా పర్వేజ్ అష్రాఫ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాక్ ప్రధానిగా రాజా పర్వేజ్ అష్రాఫ్

పాక్ ప్రధానిగా రాజా పర్వేజ్ అష్రాఫ్

Written By news on Friday, June 22, 2012 | 6/22/2012

పాకిస్థాన్ 25వ ప్రధానిగా అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ రాజా పర్వేజ్ అష్రాఫ్ ఎంపికయ్యారు. గిలానీ ప్రభుత్వంలో అష్రాఫ్ ఫెడరల్ మంత్రిగా పనిచేశారు. పార్లమెంట్ దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో 211 ఓట్లతో ప్రధాన మంత్రిగా అష్రాఫ్ ఎంపికయ్యారు. ప్రతిపక్ష ముస్లీ లీగ్ నవాజ్ (పీఎమ్ఎల్-ఎన్) అభ్యర్థి సర్దార్ మెహ్తబ్ అబ్సాసీకి 89 ఓట్లు వచ్చాయి. ఏప్రిల్ 26 తేదిన సుప్రీం కోర్టు ప్రధాని గిలానిపై అనర్హుడిగా ప్రకటించడంతో ప్రధాని పదవికి ఖాళీ ఏర్పడింది. 

గిలానీ స్థానంలో తొలుత మగ్గూం షాబుద్దీన్ పీపీపీ ఎంపిక చేయగా.. అక్రమ డ్రగ్స్ కోటా కేసులో నార్కోటిక్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో షాబుద్దీన్ స్థానంలో అష్రాఫ్ ను పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. శుక్రవారం సాయంత్రం అష్రాఫ్ ను అభినందించిన అనంతరం డాన్ న్యూస్ తో అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై జాతీకి ఉన్న విశ్వాసమే ప్రధాని ఎంపిక అని అన్నారు. 
Share this article :

0 comments: