షర్మిల మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స - ఆరు వారాలు విశ్రాంతి అవసరం: అపోలో వైద్యుల సలహా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స - ఆరు వారాలు విశ్రాంతి అవసరం: అపోలో వైద్యుల సలహా

షర్మిల మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స - ఆరు వారాలు విశ్రాంతి అవసరం: అపోలో వైద్యుల సలహా

Written By Unknown on Tuesday, December 18, 2012 | 12/18/2012

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్సులో ఉన్న అపోలో ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం ఈ శస్త్ర చికిత్స జరిగింది. శ్రీమతి షర్మిలకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని అపోలో ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. శస్త్ర చికిత్స పూర్తయిన అనంతరం వైద్యులు ఈ విషయం ప్రకటించారు. విశ్రాంతి సమయంలో ఆమెకు ప్రతి రోజూ ఫిజియో థెరఫీ చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి సెల్‌ థెరపీ కూడా చేస్తామని వారు వెల్లడించారు.
Share this article :

0 comments: