జైన మందిరం సందర్శించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జైన మందిరం సందర్శించిన జగన్

జైన మందిరం సందర్శించిన జగన్

Written By news on Saturday, July 4, 2015 | 7/04/2015

కాకినాడ : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కాకినాడ దేవాలయం వీధి విక్టరీ హౌస్ కాలనీలోని మార్వాడీల శీత్రి మందిర్‌ను  సందర్శించారు. పార్టీ అభిమాని నిర్మల్‌జైన్ నివాసంలో గురువారం రాత్రి బస చేసిన జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటకు బయలుదేరే ముందు అక్కడకు సమీపంలోని ఈ ఆలయానికి వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాకినాడలోని మార్వాడీలు, జైన్‌లు ఎంతగానో ఆదరించారని చెప్పారు. వీరంతా ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

కాకినాడ జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవర్‌లాల్ జైన్, సంఘ ప్రతినిధులు హంసరాజ్ జైన్, మహేందర్, కాంతిలాల్, ఈదారామ్‌చౌదరి, సామర్లకోట, పిఠాపురం జైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబాల్‌లాల్, తారత్‌మాల్ జైన్, పెద్దాపురంలోని జైన్ ప్రతినిధులు కూడా నిర్మల్‌జైన్ నివాసానికి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మార్వారీ యువమంచ్ ప్రతినిధులు కూడా జగన్‌ను కలిశారు.
 
 అధినేతతో కాకినాడ నగర నేతల భేటీ
 కాకినాడ వచ్చిన జగన్ మోహన్‌రెడ్డిని పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కలుసుకున్నారు. నిర్మల్‌జైన్ నివాసం వద్ద వీరందరినీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డికి పరిచ యం చేశారు. అధినేతను కలిసిన వారిలో పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, జిల్లా వక్ఫ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, మీసాల దుర్గాప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి జోగా రాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కె.ఆదిత్యకుమార్ తోపాటు వివిధ డివిజన్లకు  చెందిన మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: