నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు

నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు

Written By news on Friday, July 3, 2015 | 7/03/2015


'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'వీడియోకి క్లిక్ చేయండి
కర్నూలు : పోలీసులు తనను అకారణంగా దూషించి, తమను రెచ్చగొట్టి మరీ తన తండ్రిపై కేసు పెట్టారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు బనాయించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. అఖిలప్రియ ఏమన్నారో ఆమె మాటల్లోనే...

ఓటు వేయడానికి నేను, నాన్నగారు కలిసి వెళ్లాం. నాన్నగారు చిన్న పనిమీద బయటకు వచ్చారు.
క్యూ ఎక్కువగా ఉందని పది నిమిషాలు కూర్చోమని పోలీసులే చెప్పడంతో కూర్చున్నాం.
నాన్న బయటకు వెళ్లగానే పోలీసులు ఒకేసారి డీఎస్పీ, ఏఎస్పీ వచ్చి.. వెంటనే నన్ను ఓటు వేసి వెళ్లిపొమ్మన్నారు
నాన్న వస్తే ఇద్దరం కలిసి ఓటేసి వెళ్లిపోతాం అని చెప్పాను
నేను ఓటర్లతో మాట్లాడిందీ లేదు, కదిలింది కూడా లేదు
అయినా ఓటు వేయాల్సిందేనని బలవంతం చేశారు
పది నిమిషాల్లో ఓటేసి వెళ్లిపోతానని చెప్పినా, వాళ్లు రూడ్ గా మాట్లాడారు.
టీడీపీ ఏజెంట్లు పోలీసుల దగ్గరకు వెళ్లి, మమ్మల్ని పంపేయాలని చెప్పడంతోనే పోలీసులు వచ్చారు
పోలింగ్ కేంద్రం వద్ద నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు డీఎస్పీ నా దగ్గరకు వచ్చి రూడ్ గా మాట్లాడారు.
గౌరు చరిత ఎవరు, ఆమెకేం సంబంధమని కూడా ఆయన అన్నారు
దాంతో నాన్న ఒక తండ్రిగానే రియాక్ట్ అయ్యారు, కూతురు ఒక్కరే ఉన్నప్పుడు అలా మాట్లాడతారా .. రూల్స్ చూపించండి అన్నారే తప్ప వాళ్లను తిట్టలేదు
వీళ్లు ఏ కేసు పెట్టినా సిల్లీ రీజన్లకే పెడుతున్నారు.
పోలీసులతో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా
వాళ్లు అత్యుత్సాహం చూపించారు. గతంలో ఎలా చేశారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు
అక్కడ పోలీసులు మాట్లాడినదానిపై మేం ఏమైనా చర్యలు తీసుకోగలమా అని చూస్తున్నాం.

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ ఆయన మీద కేసు పెట్టారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. తనతో పాటు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఇలా ఎందుకు జరుగుతోందని భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. ఓటు వేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన సందర్భంలో పోలీసు అధికారులు ఆమెను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు భూమా నాగిరెడ్డికి సమాచారం అందింది. యువ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని, కావాలని రెచ్చగొట్టే ధోరణిలో కామెంట్లు చేయడం సరికాదని అక్కడున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.
అయితే.. జరిగిన అన్యాయంపై అలా ప్రశ్నించినందుకే.. పోలీసు అధికారులను దూషించారంటూ కేసులు పెట్టారు. ఆయనపై 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్ కు తరలించినట్లు తెఇసింది. దీంతో ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, కారణం ఉన్నా లేకపోయినా తమ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయన్న సూచనలు రావడం వల్లే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. గతంలో కూడా భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి.
Share this article :

0 comments: