'మానవత్వం,విలువలే వైఎస్ఆర్ నేర్పారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'మానవత్వం,విలువలే వైఎస్ఆర్ నేర్పారు'

'మానవత్వం,విలువలే వైఎస్ఆర్ నేర్పారు'

Written By news on Wednesday, December 5, 2012 | 12/05/2012

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు మానవత్వం, విలువల గురించే నేర్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. వైఎస్ఆర్ తనయుడిగా జగన్ ఎవరినీ మోసం చేయడం నేర్చుకోలేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జగన్ బయట ఉండి ఉంటే మీ ఆశీర్వచనాల కోసం ఇక్కడికి వచ్చేవారన్నారు. ప్రజల కష్టాలను వైఎస్ఆర్ దగ్గరగా చూశారని చెప్పారు. అందుకే వైఎస్ఆర్ తన పాలనలో ఎటువంటి పన్నులు వేయలేదని గుర్తు చేశారు. పెంచిన గ్యాస్ ధరను వైఎస్ఆర్ ప్రభుత్వమే భరించిందన్నారు.

ఏ కోర్టూ, ఏ కేసులోనూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును నిర్దోషి అనకుండానే, ఆయన నిర్దోషి ఎలా అయ్యారని ఆమె ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారని ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీ, రహేజా వంటి ప్రాజెక్ట్లకు భూములను కట్టబెట్టింది చంద్రబాబేనని తెలిపారు. రెండు ఎకరాలున్న చంద్రబాబుకు దేశవిదేశాల్లో ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. వజ్రాల కోసం రెండున్నర లక్షల ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేశారన్నారు. ఎందరో ప్రధానులను తానే చేశానన్న బాబు ఏనాడైనా రైతుల కష్టాలపై లేఖ రాశారా? అని ప్రశ్నించారు.

చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్ నాధ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు భరించలేకే తాను బయటకు వచ్చినట్లు అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురితోపాటు ఆ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, రోజా తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో వైఎస్ విజయమ్మకు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
Share this article :

0 comments: