
అసెంబ్లీలో ప్రతిపక్షం ‘షాడో కేబినెట్’లా వ్యవహరించాలి
వ్యవసాయ రుణాలు మాఫీ చేయూలని గట్టిగా పట్టుబట్టాలి
విద్యార్థి, యువజనుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలి
చంద్రబాబు హామీలపై ప్రభుత్వానిది కప్పదాటు వైఖరి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజలకు మేలు చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శాసన సభాపక్షం నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నుంచి శాసన సభ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్టీ శాసన సభాపక్షం (వైఎస్సార్‌సీఎల్పీ) సమావేశానికి జగన్ అధ్యక్షత వహించారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులు, రాజధాని ఎంపిక, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పలు ప్రజా సమస్యలపై రెండు గంటలకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను శాసన సభ్యులు పూర్తిగా అవగాహన చేసుకోవాలని, వాటిపై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలని కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ‘షాడో కేబినెట్’లా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కరువు బారిన పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సభలో గట్టిగా డిమాండ్ చేయూలని చెప్పారు. విద్యార్థి, యువజనుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలన్నారు. ప్రజలు మెచ్చే విధంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆయా శాఖలపై జరిగే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో సమయపాలన పాటించాలని, క్రమం తప్పకుండా అందరూ హాజరై పూర్తి సమయం సభలో ఉండాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలపై ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న కప్పదాటు విధానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి
0 comments:
Post a Comment