
పక్కా వ్యూహం ప్రకారం దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ హత్యలు జరుగుతూనే ఉన్నాయని.... రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.పోలీస్ స్టేషన్లలోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని కోటంరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. బాధితుల వివరాలతో సహా ఆయన ప్రస్తావించారు.
కలెక్టర్ పై దాడి చేసినా తూతూమంత్రంగా కేసులు పెట్టారని కోటంరెడ్డి తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫాకి దిగారని, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డారని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కూడా ముప్పు ఉందని, చెవిరెడ్డికి ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ చర్చపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. అధికార పక్షంపై కావాలనే బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు.
0 comments:
Post a Comment