Home »
» చర్చ జరుగుతుండగానే దాడులా?
చర్చ జరుగుతుండగానే దాడులా?
హైదరాబాద్: హత్యారాజకీయాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని పదేపదే కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒకవైపు సభలో చర్చ జరుగుతుండగానే ఎక్కడికక్కడ రాజకీయ హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.మనుషుల ప్రాణాల కంటే విలువైంది ఏమైనా ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. శాంతిభద్రతలపై కచ్చితంగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ బడ్జెట్‌పై రేపు చర్చిద్దామని, ఇవాళే హత్యారాజకీయాలపై చర్చకు అనుమతివ్వాలని స్పీకర్ ను జగన్ కోరారు. ముందుగా బడ్జెట్ చర్చ ప్రారంభించాలని జగన్ కు స్పీకర్ కోడెల విజ్ఞప్తి చేశారు. అయితే బడ్జెట్ పై చర్చ ప్రారంభినట్టుగా భావించాలని జగన్ సమాధానమిచ్చారు. దీంతో హత్యారాజకీయాలపై చర్చకు స్పీకర్ అనుమతిచ్చారు.
0 comments:
Post a Comment