అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ

అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ

Written By news on Saturday, August 23, 2014 | 8/23/2014

అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ
హైదరాబాద్ : పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 'ఇదేంటి అధ్యక్షా.. ఆయన నోటికొచ్చినట్లు తప్పులు మాట్లాడుతుంటే, మీరు అనుమతిస్తూనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి నేను సూటిగా అడుగుతున్నాను' అని చెప్పారు.
Share this article :

0 comments: