బాబూ.. నాటి మాటలేమయ్యాయి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. నాటి మాటలేమయ్యాయి!

బాబూ.. నాటి మాటలేమయ్యాయి!

Written By news on Saturday, February 7, 2015 | 2/07/2015


బాబూ.. నాటి మాటలేమయ్యాయి!
  • బాబుపై వైఎస్సార్‌సీపీ వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు 2013 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ చెప్పిన మాటలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ సూటిగా ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే పెట్రోల్, డీజిల్‌పై పెంచిన వ్యాట్ పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీలు పెంచాలనే ఆలోచనను మానుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాందోళన చేపడతామని హెచ్చరించారు. 2013 ఏప్రిల్ 2న చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో కాకినాడ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరే కించారని ఆమె గుర్తుచేశారు.

తాను అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు అసలు పెంచనని, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తానని ఆ రోజున ప్రకటించిన చంద్రబాబు ఈరోజు ప్రజలపై భారం మోపడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘పెంచిన చార్జీలను బేషరతుగా తగ్గించాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని కూడా చంద్రబాబు ఆరోజు డిమాండ్ చేశారు.  ప్రభుత్వం నుంచి వైదొలగకపోతే ప్రజలు తిరగబడాలని కూడా పిలుపునిచ్చారు. ఆరోజు ప్రజలకు భారం అనిపించిన విద్యుత్ చార్జీలు ఈరోజు భారంగా బాబుకు అనిపించడం లేదా ?’’ అని ఆమె ప్రశ్నించారు.
 
ఉద్యమించిన వారిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది...

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలోనూ ఏటా కరెంటు చార్జీలు పెంచడమేగాక అందుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపి పొట్టన బెట్టుకున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత  వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఏనాడూ విద్యుత్ చార్జీలు, పన్నులు, ఆర్టీసీ చార్జీలు పెంచలేదని, ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు, చంద్రబాబు చార్జీలు పెంచుతున్నారని తెలిపారు.
Share this article :

0 comments: