Home »
» రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం
రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. మోకళ్ల లోతు వరకూ నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ వైఖరికి నిరసనగా వైఎ స్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల ఇళ్లు తీసుకుంటామని, నోటిఫై చేసిన ప్రతి సెంట్ భూమిని తీసుకుంటామని సీఆర్ డీఏ కమిషనర్ అంటున్నారని ఆర్కే చెప్పారు.రోజురోజుకీ రైతులను సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండో పంట వేయొద్దని చెప్పే అధికారం సీఆర్ డీఏ కమిషనర్ కు ఎక్కడదంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారా? రాజకీయ నేతా? అంటూ ప్రశ్నించారు. రైతులను సీఆర్ డీఏ కమిషనర్ భయపడితే తాము చూస్తూ ఊరుకోమంటూ ఆర్కే స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment