దుర్గాప్రసాద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దుర్గాప్రసాద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

దుర్గాప్రసాద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Wednesday, February 4, 2015 | 2/04/2015

రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని మోరంపూడి జంక్షన్ లో స్కూల్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్బంగా దుర్గా ప్రసాద్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
రాజమండ్రి మోరంపూడి జంక్షన్ లోని 16వ నంబరు జాతీయ రహదారిపై స్కూల్ బస్సు ఆదివారం బీభత్సం సృష్టించింది. వేమగిరి వైపు వెళ్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: