ఒంగోలు జాతి'పై ఒప్పందాలు వద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒంగోలు జాతి'పై ఒప్పందాలు వద్దు

ఒంగోలు జాతి'పై ఒప్పందాలు వద్దు

Written By news on Sunday, November 15, 2015 | 11/15/2015


'ఒంగోలు జాతి'పై ఒప్పందాలు వద్దు
కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి
బ్రెజిల్ వ్యవసాయ మంత్రితోనూ భేటీ
* సాంకేతిక సహకారంపై విన్నపం
సాక్షి, న్యూఢిల్లీ: ఒంగోలు జాతి పశువుల కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఇచ్చేందుకు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే బ్రెజిల్ వ్యవసాయ మంత్రిని కలసి పశుగణాభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపుపై తగిన సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఆయన శనివారం ఉదయం ఢిల్లీలో వారితో సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు.

'ఈరోజు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి మాట్లాడాను. దేశానికి తలమాణికమైన ఒంగోలు జాతి పశువులకు సంబంధించి మనకు గల హక్కులను కాపాడాలని కోరాం. అనధికారికంగానే బ్రెజిల్ ఒంగోలు జాతిని అభివృద్ధి పరుచుకుంది. అధికారికంగా ఇస్తే ఇక మొత్తం హక్కులు వాళ్లకే దక్కే ప్రమాదం ఉందని చెప్పాం. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. భారత దేశ ఆస్తి అయిన ఒంగోలు పశువులపై ఎలాంటి హక్కును బ్రెజిల్‌కు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు' అని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పొగాకు రైతుల విషయమై కూడా మాట్లాడినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో 34 మంది రైతులు చనిపోగా అందులో 17 నుంచి 18 మంది పొగాకు రైతులేనని తెలిపారు.
Share this article :

0 comments: