కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్

కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్

Written By news on Wednesday, November 18, 2015 | 11/18/2015


కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్
వరంగల్ : 'ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హఠాత్తుగా ఎవరైనా చనిపోయి ఉంటే... ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటే ఎవరికీ ఆక్షేపణ ఉండదు. నిజంగా కూడా గర్వపడేవారం. ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయంటే... కేసీఆర్ మోజు తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉన్న ఎంపీని ఆ పదవికి రాజీనామా చేయించి, ఆయనను మంత్రిని చేశారు. ఇవాళ ప్రజల నెత్తిన ఇంత భారం వేస్తున్నారు.

ఎన్నికలు ఎలాగూ వచ్చాయి కాబట్టి... ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాల్సి ఉంది. 18 నెలల పరిపాలన చూశాక, కేసీఆర్ కు ఓటు వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పొరపాటు కేసీఆర్ కు ఓటు వేస్తే...  నా పాలన బాగుంది అందుకే ఓటు వేశారనుకుంటారు. ఇప్పుడే పట్టించుకోవటం లేదు. ఇక ఉప ఎన్నికలో గెలిస్తే... ఇక అస్సలు పట్టించుకోరని' వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవాచారి స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు.

వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో  టీఆర్ఎస్‌ను ఓడించి.... సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వాలని  వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా సభ ప్రారంభమైనా ఎంతో ఓపిగ్గా వేచి ఉన్నందుకు అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు వైఎస్‌ జగన్‌కు ఓరుగల్లు ప్రజలు నీరాజనం పలికారు. పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌ తరపున వైఎస్‌ జగన్‌ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రతిచోట విశేష స్పందన లభిస్తోంది. అంతకుముందు గీసుకొండలో ప్రసంగించిన వైఎస్‌ జగన్‌... సీఎం కేసీఆర్‌ 18నెలల పాలనపై నిప్పులు చెరిగారు.
 
ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే!
  • మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు శిరస్సు వంచి పేరుపేరును కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా.
  • ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి
  • హఠాత్తుగా ఎవరైనా చనిపోయి ఉండి ఈ ఎన్నికలు జరిగి ఉంటే ఎవరికీ ఆక్షేపణ ఉండకపోయింది
  • లేక కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా ఈ ఎన్నికలు జరిపి ఉంటే గర్వపడేవాళ్లం
  • కానీ కేసీఆర్ మోజు తీర్చుకునేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి
  • మీ పార్టీలో మన జిల్లా నుంచి గెలిచిన దళిత ఎమ్మెల్యేలు ఎవరూ లేరా? అని కేసీఆర్ ను అడగండి
  • వరంగల్‌ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలున్నా, మోజుపడి ఎంపీతో రాజీనామా  చేయించి.. మంత్రిని చేశారు.
  • డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని పదవి నుంచి ఊడబెరికారు
  • తన మోజు తీర్చుకోవడానికి ప్రజల నెత్తిన ఈ ఎన్నికల భారాన్ని కేసీఆర్ మోపుతున్నారు
  • కేసీఆర్ 18 నెలల పాలన చూసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలి.
  • పొరపాటున మనం కేసీఆర్‌కు ఓటు వేస్తే.. నా పరిపాలన బాగుందన్న భావనతో ఆయన ప్రజల్ని అసలే పట్టించుకోరు
  • 18 నెలల పాలనలో 150 మంది రైతులు మన జిల్లాలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
  • కేసీఆర్ ఒక్కసారైనా పత్తిరైతుల పొలాల్లోకి వెళ్లారా? వాళ్ల కష్టాలను స్వయంగా చూశారా?
  • పత్తి క్వింటాలు మద్దతు ధర 4,500 చెప్పి.. ఆ కోత, ఈ కోత పేరిట రైతులకు రూ. 3,500 ధర కూడా చెల్లంచడం లేదు.
  • రైతు రుణమాఫీ అమలు విషయంలో మోసం చేశారు.
  • నాలుగు దఫాలుగా రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల అప్పడే ఎందుకు చెప్పలేదు?
  • రుణాలు చెల్లించకపోవడంతో రైతుల నుంచి బ్యాంకులు 14శాతం అపరాధ వడ్డీని వసూలుచేస్తున్నాయి.
  • దీంతో వచ్చే మాఫీ సొమ్ములో ముప్పావు వంతు అపరాధ వడ్డీకే వెళుతున్నది
  • దివంగత నేత వైఎస్‌ఆర్ పరిపాలన గుర్తుతెచ్చుకోండి అని కేసీఆర్‌కు చెప్పండి
  • సీఎం అంటే వైఎస్ఆర్‌ మాదిరిగా ఉండాలి
  • రెండు బెడ్‌రూంల కట్టిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారు
  • కానీ ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఇళ్లు కట్టించారు? అని కేసీఆర్‌ను ప్రశ్నించండి
  • రాష్ట్రం మొత్తంగా కేసీఆర్ 398 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు కట్టించారు
  • వైఎస్ఆర్‌ ఐదేళ్లలో ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు
  • ఏ రోజు అయినా మీరు మార్కెట్‌కు వెళ్లారా? కూరగాయలు కొనాలంటే రేట్లు షాకు కొడుతున్నాయని కేసీఆర్‌ను గట్టిగా నిలదీయండి
  • ఏడాది కిందట కేజీ కందిపప్పు రూ. 90 ఉంటే ప్రస్తుతం రూ. 230. రూ.85 ఉన్న మినపపప్పు ప్రస్తుతం 200 కేజీ టమాటా ధర రూ. 14 నుంచి 50 అయింది.
  • పేదరికం పోవాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కరన్నా డాక్టర్ కావాలి, ఒక్కరన్నా ఇంజినీర్‌ కావాలి అనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ఆర్‌ ఫీజు రీయింబర్స్ మెంట్‌ పథకాన్ని తెచ్చారు
  • ఇవాళ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు సరిగ్గా జరుగలేదు.
  • కాలేజీలు మొదలై కూడా ఐదు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ గత ఏడాది ఫీజు బకాయిలే ప్రభుత్వం విడుదల చేయలేదు.
  • ప్రతి దళితుడికి కూడా మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమి పంచారో కేసీఆర్‌ను అడగండి
  • వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66వేల ఎకరాల భూమిని పంచితే.. కేసీఆర్ 1600 ఎకరాలు మాత్రమే పంచారు.
  • విశ్వసనీయత రావాలంటే రాజన్న రాజ్యం రావాలి.
  • అందుకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా.
Share this article :

0 comments: