కుట్ర రాజకీయాలకు స్వస్తి పలకాలి: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్ర రాజకీయాలకు స్వస్తి పలకాలి: షర్మిల

కుట్ర రాజకీయాలకు స్వస్తి పలకాలి: షర్మిల

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

కుట్ర, కుతంత్రాలతో కూడిన రాజకీయాలకు స్వస్తి పలకాలని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ కుమార్తె షర్మిల ఓటర్లకు పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలసి ఈరోజు ఆమె ఇక్కడికి వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ జరిగిన చివరి సమావేశంలో ఆమె ప్రసంగించారు. విజయమ్మ, షర్మిల రాక సందర్భంగా తిరుపతి జనసంద్రమైంది. విజయమ్మకు జనం నీరాజనం పలికారు. భారీగా జనం తరలి వచ్చారు. జనవాహినిని ఆకట్టుకునే విధంగా షర్మిల ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి విశేష స్పందన లభించింది. 

రాజశేఖరుని మంచి మనసు అందరికి తెలుసన్నారు. ఆయన బతికి ఉండగా వెంట తిరిగిన వారు, ఆయన ద్వారా లబ్దిపొందినవారు ఈ రోజు విమర్శిస్తున్నారని బాధపడ్డారు. రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జగనన్నతోపాటు ఆయనని కూడా వీళ్లు జైలులో పెట్టేవారు కాదా? అని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టడమే జగనన్న చేసిన తప్పా అని షర్మిల ప్రశ్నించారు. జనమే జగనన్నని బయటకు తీసుకువస్తారు. ముఖ్యమంత్రిని కూడా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కుట్రలు పన్నే రాజకీయ నాయకులకు స్వస్తిపలకాలని పిలుపు ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ పరిపాలన మళ్లీ రావాలని ఆమె ఆకాంక్షించారు.

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 16 మంది ఎమ్మెల్యేలలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి, ప్రజారాజ్యం పార్టీని మూసేశారని విమర్శించారు. సొంత ఊరులో ఓడించినా, తిరుపతి ప్రజలు గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన కుమార్తె ఇంట్లో 32 కోట్ల రూపాయలు దొరికాయి. ఇంట్లోనే ఇంత డబ్బు ఉంటే ఇంక బయట ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నారో తెలియదన్నారు. 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బండారం నిన్న కోలా కృష్ణ మోహన్ బయటపెట్టారన్నారు. ఆయన విదేశాలలో దాచుకున్న డబ్బు వ్యవహారం అంతా సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చారని తెలిపారు. సాక్షి లేకపోతే ఈ కోలా కృష్ణ మోహన్ ఆరోపణలు కూడా బయటకు వచ్చేవి కాదని ఆమె చెప్పారు. ఎల్లో మీడియాని చంద్రబాబు మేనేజ్ చేసేవారన్నారు. 

విలువలకు, విశ్వసనీతయకు ప్రధాన్యత ఇచ్చే కరుణాకర రెడ్డికి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వారు, తెలుగుదేశం వారు డబ్బులు ఇచ్చినా మీ మన:సాక్షి ప్రకారం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కరుణాకర రెడ్డి అన్నను గెలిపించాలని కోరారు. 
ప్రచారం వాహనంపైన పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర రెడ్డితోపాటు పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజా, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.
Share this article :

0 comments: