నెల్లూరు.. పోలీసుల హల్‌చల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరు.. పోలీసుల హల్‌చల్

నెల్లూరు.. పోలీసుల హల్‌చల్

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

నెల్లూరులో బాధితులనే అరెస్ట్ చేసిన పోలీసులు 
కాంగ్రెస్ ఏజెంట్ల ప్రచారం.. అధికారుల ప్రేక్షక పాత్ర 
పోలింగ్ కేంద్రం వద్ద సుబ్బరామిరెడ్డి సైగల ప్రచారం 
ఎన్నికలను బహిష్కరించిన రెండు గ్రామాల ప్రజలు 

నెల్లూరు లోక్‌సభ స్థానానికి, దాని పరిధిలోనే ఉన్న ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో.. ఉదయగిరి, నెల్లూరు సిటీ నియోజకవ ర్గాల్లో పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం జి. కొండారెడ్డిపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారు. నెల్లూరు నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీలో ఒక పోలింగ్‌బూత్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తను వారించటంతో ఘర్షణకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జాన్యానికి దిగినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిపై లాఠీచార్జి జరపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ ఏజెంట్లు ఎన్నికల ప్రచారం చేసినా అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారు. దుత్తలూరు మండలం బొడ్డువారిపల్లెలో రిగ్గింగుకు పాల్పడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డుకోవటంతో ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీచార్జి జరిపి గుంపులను చెదరగొట్టారు. లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డి మూలాపేటలోని ఒక పోలింగ్ బూత్‌లో హస్తం గుర్తుకు ఓటేయాలని సైగలు చేయటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కూ ఫిర్యాదు చేశారు. కావలి నియోజకవర్గం రూరల్ మండలం చౌదరిపాలెంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనందుకు నిరసనగా గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ బూత్‌లో ఒక్క ఓటు పోలయింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామంలో ఇఫ్కో ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పోలింగ్‌కు హాజరు కాలేదు. నెల్లూరు లోక్‌సభ స్థానంలోని ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో.. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, ఉదయగిరి, కోవూరు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు నియోజకవర్గం కూడా ఉంది. నెల్లూరు సిటీ (55), నెల్లూరు రూరల్ (61), కావలి (60.05), ఆత్మకూరు (80), కోవూరు (76.7), ఉదయగిరి (77), కందుకూరు (78.3) పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. పోలింగ్ ప్రారంభంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు పడిగాపులు కాయాల్సి వచ్చింది. 
Share this article :

0 comments: