తుపాన్ సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తుపాన్ సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనండి

తుపాన్ సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనండి

Written By news on Saturday, October 12, 2013 | 10/12/2013

https://www.facebook.com/ysrcpofficial
తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు  పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడారు.

 ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. ఈ జిల్లాలో ఎక్కువ భాగం అంథకారంలో ఉంది. సహాయ కార్యక్రమాలలో పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నెల రోజుల్లోనే రెండు సార్లు నిరవధిక నిరాహార దీక్ష చేసిన శ్రీ జగన్‌ ఆరోగ్యం బాగా దెబ్బతిన్న కారణంగా కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిమ్సు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే నిమ్సు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన పై లిన్‌ తుపాను ప్రభావం రాష్ట్రంలోని లక్షలాది మందిపై పడుతుందన్న వార్తలతో కలత చెందారు. దీనితో ఈ ఉదయం నుంచే ఆయన ఆయా జిల్లాల ఇన్‌చార్జిలతో ఫోన్‌లో మాట్లాడారు. ధర్మాన కృష్ణదాసు (శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు, సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం), కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివిస్ (విశాఖపట్నం), టి. బాలరాజు (పశ్చిమ గోదావరి), కుడుపూడి చిట్టబ్బాయి (తూర్పు గోదావరి)లతో శ్రీ జగన్‌ మాట్లాడారు.


కాగా, పై లిన్‌ ప్రభావిత జిల్లాల నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, నాయకులతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కూడా ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్కారు.
Share this article :

0 comments: