రేపు రేణిగుంటకు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు రేణిగుంటకు జగన్

రేపు రేణిగుంటకు జగన్

Written By news on Monday, April 13, 2015 | 4/13/2015


రేపు రేణిగుంటకు  జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రేణిగుంటకు రానున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఉదయం 7.30 గంటల విమానానికి హైదరాబాద్ నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు.

అక్కడి నుంచి రోడ్డుమార్గం గుండా కావలికి వెళతారని తెలిపారు. జిల్లాలోని పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకాలని నారాయణస్వామి పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: