విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిది?

విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిది?

Written By news on Tuesday, May 19, 2015 | 5/19/2015


'విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిది?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఏడాది పాలనలో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్ మారుస్తామన్నారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని రాంబాబు నిలదీశారు.
Share this article :

0 comments: