అన్ని వర్గాల్లో ఆవేదనే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్ని వర్గాల్లో ఆవేదనే!

అన్ని వర్గాల్లో ఆవేదనే!

Written By news on Tuesday, May 19, 2015 | 5/19/2015

- 8 రోజుల జగన్ భరోసా యాత్రలో వినిపించిన జనం గుండె గొంతుక
- 14 రైతు కుటుంబాలకు భరోసా
- మండే ఎండల్లోనూ ఎదురుచూసిన జనం
- జననేతకు బాధలు చెప్పుకున్న ప్రజలు


అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా లో చేపట్టిన రెండో విడ త రైతు భరోసాయాత్ర ఆద్యంతం రైతులు, మహిళలు, యువతకు భరోసానిచ్చేలా సాగింది. 8 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో, 1150 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో వందలాది గ్రామాల ప్రజలను జగన్ పలకరించారు. ఆత్మహత్య చేసుకున్న 14 మంది రైతు కుటుంబాలను పరామర్శించారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి రాత్రి తొమ్మిది  గంటలవరకూ రోజుకు 12 గంటలపాటు వేసవిని కూడా లెక్కచేయకుండా జగన్ చేసిన భరోసా యాత్రకు బ్రహ్మరథం పట్టారు.

ఒక్కోరోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ యాత్ర సాగినప్పటికీ ఓపికగా రోడ్ల మీదనే జనం వేచి చూసి మనసారా స్వాగతం పలికారు. జగన్ కూడా తన కోసం వేచి ఉన్న ప్రజల కోసం యాత్ర సాగిన ప్రతీ గ్రామంలోనూ ఆగి వారిని పేరు పేరునా పలకరించారు. అనంతపురం పట్టణంలోని బస్టాండులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ర్టవ్యాప్త బంద్ చేపడతామని సర్కారును హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండపై మండిపడ్డారు. అధికార పార్టీ చేతిలో హత్యకు గురైన పార్టీ నేతలు ప్రసాద్ రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మల్లికార్జున కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రసాదరెడ్డి హత్యానంతరం చెలరేగిన అల్లర్ల ఘటనలో అనంతపురం జిల్లా సబ్‌జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తదితరులను పరామర్శించారు.

గుంతకల్లు నియోజకవర్గంలోని తిమ్మాపురంలో, ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ పట్టణంలో, రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్, కాదలూరుల్లో ముఖాముఖి నిర్వహించి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, యువతీ యువకుల ఆవేదనను ఆలకించారు. తమ వ్యవసాయ, బంగారు రుణాలు మాఫీ కాలేదని రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి కూడా రావడం లేదని యువతీ యువకులు మాటామంతీలో వాపోయారు.

తమకు నెలకు వస్తున్న రూ.600 సబ్సిడీ కూడా రెండు నెలలుగా రావడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తంచేశారు. రానున్నవి మంచి రోజులని.... మన ప్రభుత్వ హయాంలో అందరి సమస్యలు పరిష్కరిస్తానని జగన్ వారికి భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు వచ్చే నెల 4,5 తేదీలల్లో చేపట్టనున్న దీక్షకు తరలిరావాలని కోరారు.
Share this article :

0 comments: