డి.హీరేహళ్ లో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డి.హీరేహళ్ లో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

డి.హీరేహళ్ లో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

Written By news on Sunday, May 17, 2015 | 5/17/2015


డి.హీరేహళ్ లో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం
అనంతపురం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డి.హీరేహళ్ లో ఘనస్వాగతం లభించింది. ఏడవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డి.హీరేహళ్ లో ఆత్మహత్య చేసుకున్న ఈరన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అన్నివిధాల తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.

అంతకు ముందు దేవగిరి క్రాస్ వద్ద వ్యవసాయకూలీలు వైఎస్ జగన్ ను కలిశారు. అక్కడ కొద్దిసేపు ఆగి జగన్ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  దేవగిరిలో నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. నాగులాపురంలో మారన్న, పూలకుర్తిలో రాముడు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
Share this article :

0 comments: