లెటరు వచ్చింది... మాఫీ మాత్రం కాలే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లెటరు వచ్చింది... మాఫీ మాత్రం కాలే!

లెటరు వచ్చింది... మాఫీ మాత్రం కాలే!

Written By news on Monday, May 18, 2015 | 5/18/2015

భరోసాయాత్రలో జగన్‌ ముందు రైతన్నల ఆవేదన
చంద్రబాబు సర్కారు మోసాలపై   4,5 తేదీల్లో దీక్షలు చేస్తున్నట్టు జగన్ ప్రకటన
భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపు

ఏడోరోజు యాత్రలో వుూడు రైతు కుటుంబాలకు భరో
సా
(అనంతపురం జిల్లా తిమ్మలాపురంలో మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి)

(అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘మీ రుణం మాఫీ అయిందని ముఖ్యవుంత్రి చంద్రబాబు సంతకంతో మా ఇంటికి లెటరు వచ్చిందన్న. అది తీసుకెళ్లి బ్యాంకు దగ్గరకు వెళ్తిని. నీ రుణం ఏం మాఫీ కాలె... హైదరాబాద్‌కు పోరుు సీఎంను కలవవుంటున్నారన్న. ఇంటికి లెటరైతే వచ్చె కానీ రుణం మాత్రం అట్టనే ఉండె...’’ అంటూ డి.హీరేహాళ్ మండలం తిమ్మలాపురానికి చెందిన రైతు పాటిల్ యువరాజు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెప్పుకుని బారువుమన్నారు. రుణమాఫీ కాకపోవడంతో పంటల బీవూ కానీ,పెట్టుబడి రాయితీ కానీ రావడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. రెండో విడత రైతు భరోసా యాత్ర ఏడో రోజైన ఆదివారం అనంతపురం జిల్లా రాయుదుర్గం నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాలేదని వాపోయారు.

ఎన్నికల ముందు వ్యవసాయు రుణాలు, బంగారు రుణాలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు మోసాలను ప్రజలకు వివరించేందుకు వచ్చే నెల 4,5 తేదీల్లో దీక్షలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ దీక్షలకు ప్రజలందరూ భారీగా తరలిరావాలని భరోసా యాత్ర సాగిన ప్రతీ గ్రావుంలో ప్రజలను కోరారు. ‘‘నేను దీక్షలు చేస్తానని ప్రకటించగానే... చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా వుహిళలకు రూ.3 వేలు ఇస్తున్నట్టు చెబుతోంది. అక్కచెల్లెమ్మలను వుళ్లీ మోసం చేసేందుకే ఈ విధంగా వ్యవహరిస్తోంది’’ అని విమర్శించారు. చంద్రబాబు మోసాలు మాకు అర్థమయ్యాయన్నా... ఆయనిచ్చే వుూడు వేలు తీసుకునే మీ దీక్షలకు వస్తామని మహిళలు జగన్‌తో చెప్పారు. దీక్షలకు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడతావుని ప్రజలు స్పష్టం చేశారు.
 పింఛన్లను నిలిపేస్తున్నారు...!

 గతంలో వచ్చే పింఛన్లను కూడా నిలిపివేస్తున్నారని ఆదివారం భరోసా సాగిన ప్రతీ గ్రావుంలోనూ వృద్ధులు, వితంతువులు జగన్ ముందు వాపోయూరు. ‘‘నేను, వూ ఆయన శంకరయ్య ఇద్దరు ముసలోళ్లమే. ఇంతకుముదు ఒకటే పింఛను ఇస్తుండ్రి. ఇప్పుడు అది కూడా తీసేసిరి. నాకు, మా ఆయనకు ఇద్దరికీ ఇప్పుడు పింఛన్లు రావడంలే’’ అని డి. హీరేహాళ్‌కు చెందిన వృద్ధురాలు శంకరమ్మ వాపోరుుంది. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని ఈ సందర్భంగా వృద్ధులకు జగన్ భరోసానిస్తూ యూత్ర సాగించారు. ఏడో రోజు రైతు భరోసా యూత్రలో రాయుదుర్గం నియోజకవర్గంలోని దేవగిరిలో గోగినేని నరసింహరావు, పులకుర్తి గ్రావుంలో బోయు రాముడు, డి. హీరేహాళ్‌లో తలారి ఈరన్న కుటుంబాలకు ఆయున భరోసానిచ్చారు.

 మూడు కుటుంబాలవారిని పరామర్శించిన జగన్
 ఏడోరోజు భరోసా యాత్రలో భాగంగా జగన్ , ఆత్మహత్యలకు పాల్పడిన మూడు రైతు కుటుంబాల వారిని ఆదివారం నాడు పరామర్శించారు. డీ.హీ రేహాళ్ మండలం పులపర్తిగ్రామానికి చెందిన బోయ రాముడు (34) భార్య సుగుణమ్మను ఓదార్చారు. అలాగే బొమ్మన హాల్ మండలం దేవగిరికి చెందిన గోగినేని నరసింహారావు (52) భార్య చంద్రమ్మను, డీ.హీరేహాళ్ గ్రామానికి చెందిన తలారి ఈరన్న (52) కుటుంబీకులను పరామర్శించారు. వారి ఇక్కట్లను తెలుసుకొని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

తానున్నానంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రవుంలో ఎంపీ మిథున్‌రెడ్డి, వూజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాష, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయుణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జీ ఉష, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రైతు విభాగం రాష్ర్ట కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి మోహన్ రెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు బోయు వుల్లికార్జున, ఎస్‌టీసెల్ కార్యదర్శి భోజరాజ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: