జగన్ దీక్షపై సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ దీక్షపై సమీక్ష

జగన్ దీక్షపై సమీక్ష

Written By news on Thursday, May 21, 2015 | 5/21/2015


జగన్ దీక్షపై సమీక్ష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 3, 4 తేదీల్లో విజయవాడ-గుంటూరు మధ్య చేపట్టనున్న రెండు రోజుల దీక్షను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో బుధవారం కృష్ణా, గుంటూరు నేతలు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశం అయ్యారు. ఐదు ప్రధాన అంశాల్లో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశంలోని నేతలు అభిప్రాయపడ్డారు. దీక్షా స్థలికి కార్యకర్తలు, ప్రజలు సులభంగా తరలిరావడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గుంటూరులో పార్టీనేతలతో దీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. ఈ సమావేశంలో  పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా,  కోన రఘపతి, పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మారెడ్డి వెంకట్వేర్లు,  లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి,  బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, రావి వెంకటరమణ, కత్తెర సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: