పులివెందులలో మూడు రోజుల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందులలో మూడు రోజుల పర్యటన

పులివెందులలో మూడు రోజుల పర్యటన

Written By news on Saturday, May 23, 2015 | 5/23/2015


నేడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రాక
తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరు
24న రైతు భరోసా యాత్ర
25న క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం

 వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పులివెందులలో తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరిన ఆయన శనివారం తెల్లవారుజామున ముద్దనూరుకు.. అక్కడ నుంచి పులివెందులకు చేరుకున్నారు.

ఈరోజు నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూలులో జరిగే రామాంజనేయులు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడినుంచి వేముల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2.30గంటలకు చక్రాయపేట మండలం కె.రాజుపల్లె గ్రామానికి చేరుకొని తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులను పరామర్శిస్తారు. 24వ తేదీ ఉదయం తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామానికి చేరుకొని ఇటీవల వివాహం చేసుకున్న నూతన జంటలను ఆశీర్వదిస్తారు. అక్కడినుంచి 9.45గంటలకు ఆర్.తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని గతనెల 20వ తేదీన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

అనంతరం 11.30గంటలకు లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చేరుకొని ఈనెల 14న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నాగభూషణం శ్రేష్టి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఇటీవల అనారోగ్యంతో మరణించిన తుపాకుల లక్షుమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిసారు. అలాగే క్రిష్టియన్‌లైన్‌లో అనారోగ్యంతో మృతి చెందిన ప్రభుదాసు కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. అనంతరం 25వ తేదీ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు
Share this article :

0 comments: