Home »
» మంగళగిరి హైవే పక్కన సమరదీక్ష
మంగళగిరి హైవే పక్కన సమరదీక్ష
హైదరాబాద్: ఐదు అంశాలపై టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరదీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా, తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.బలవంతపు భూసేకరణ, రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు సమరదీక్షకు పూనుకున్నారని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో జగన్ సమరదీక్ష చేస్తారని చెప్పారు.
0 comments:
Post a Comment