ఐదు ప్రధాన అంశాలపై దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు ప్రధాన అంశాలపై దీక్ష

ఐదు ప్రధాన అంశాలపై దీక్ష

Written By news on Thursday, May 21, 2015 | 5/21/2015


3,4 తేదీల్లో జగన్ ‘సమర దీక్ష’
చంద్రబాబు ఏడాది పాలన
వైఫల్యాలపై..నిరసన
గుంటూరు- విజయవాడ
పరిసరాల్లో వేదిక
ఐదు ప్రధాన అంశాలపై దీక్ష


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ‘సమర దీక్ష’ పేరుతో నిరాహార దీక్ష చేయనున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య వేదికగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు.


సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మీడియాకు వెల్లడిస్తూ ఐదు ప్రధాన అంశాలపై ఈ సమర దీక్ష కు దిగుతున్నట్టు వెల్లడించారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడం, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానన్న హామీ నిలబెట్టుకోకపోవడం, బాబొస్తే జాబొస్తుందని ఇంటింటికీ ప్రచారం చేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం, ఉద్యోగమివ్వకపోతే నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇవ్వకపోవడం, వంటి వాటిని ఎత్తిచూపడానికి దీక్ష సాగిస్తున్నట్టు కె.పార్థసారథి వివరించారు.

కుర్చీ కోసం అబద్ధాలు..
కుర్చీ కోసం ఎన్నికల ముందు అబద్ధాలాడి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలను మోసం చేశారని పార్టీ ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. మొత్తం రైతుల రుణాలు రూ.87,617 కోట్లు ఉంటే ఇప్పటికి రూ.6,500 కోట్లు మాత్రమే నిధులిచ్చారంటే దానర్థమేంటని దుయ్యబట్టారు. రూ. 22 వేల కోట్ల డ్వాక్రా మహిళల రుణాల మాఫీ ప్రస్తావన లేకుండా పూర్తిగా మొండిచేయి చూపారని మండిపడ్డారు.

దీక్ష సందర్భంగా ఈ వైఫల్యాలన్నింటిపైనా జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా ప్రజలను చైతన్య పరుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ లు పాల్గొన్నారు.
Share this article :

0 comments: