ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటా

ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటా

Written By news on Monday, May 18, 2015 | 5/18/2015

ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటా
బొమ్మనహాళ్ : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం ఆయన బొమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు గోగినేని నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లి హప్పమ్మ, భార్య చంద్రమ్మ, కూతురు దివ్య రూప, కుమారుడు ఈశ్వర్‌కుమార్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారావు కుటుంబ సభ్యులు, జగన్ మధ్య సంభాషణ  ఇలాసాగింది.

 వైఎస్ జగన్ : నరసింహారావు ఎలా చనిపోయాడమ్మా?
 చంద్రమ్మ (రైతు భార్య): ఊరి బయట చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.

 జగన్ : సొంత పొలం ఎంతుంది తల్లీ?
 చంద్రమ్మ: సొంత పొలం లేదు సార్. కౌలుకు చేశాం.

 జగన్ : ఎన్ని ఎకరాలు సాగు చేశారు?
 చంద్రమ్మ: పదెకరాలు

 జగన్: ఏయే పంటలు సాగు చేశారమ్మా?
 చంద్రమ్మ : పత్తి పంట వేశాం. దిగుబడి సరిగా రాక నష్టపోయాం.

 జగన్ : బ్యాంకులో అప్పులేమైనా ఉన్నాయా తల్లీ?
 చంద్రమ్మ : పొలముంటే కదా సార్ అప్పు ఇచ్చేది?!

 జగన్: రుణ అర్హత కార్డు లేదా?
 చంద్రమ్మ : కౌలు చేస్తున్నట్లు గుర్తింపు పత్రాలు ఇక్కడ ఎవరూ రాసివ్వరు సార్. అందుకే రుణ అర్హత కార్డు లేదు.

 జగన్ : అప్పు ఎంతుందమ్మా?
 చంద్రమ్మ : దాదాపు రూ.3 లక్షలు సార్.

 జగన్: ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదా?
 చంద్రమ్మ : లేదండీ.. రెవెన్యూ అధికారులు అప్పులున్నట్లు ఆధారాలు కానీ, ప్రాంసరీ నోట్లు కానీ చూపమన్నారు. అప్పు ఇచ్చిన వారు ఆత్మహత్య కేసు తమపై వస్తుందని ప్రాంసరీ నోట్లను చూపడానికి ముందుకు రాలేదు.

 జగన్: బంగారంపై లోను ఉందా? ఎంత బంగారముంది తల్లీ?
 చంద్రమ్మ : 10 తులాల బంగారం ఉండేది. ఎక్కడ తాకట్టు పెట్టారో తెలియదు సార్.  బ్యాంకులలో విచారిస్తే తెలియదన్నారు. బళ్లారిలో మార్వాడీల దగ్గర పెట్టి ఉండొచ్చు. ఆధారాలేమీ లేవు.

 జగన్: డ్వాక్రా రుణాలేమైనా ఉన్నాయా?
 చంద్రమ్మ: డ్వాక్రా సంఘంలో మా అత్త ఉండేది. వయసు మీరిపోయిందని తొలగిం చారు. నన్ను సంఘంలో చేర్చుకోలేదు.

 జగన్ : ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఏమై నా వచ్చాయా?
 చంద్రమ్మ : అలాంటివేమీ రాలేదు సార్.
 జగన్: కౌలు రైతుగా ఈ కుటుంబానికి సహా యం అందడానికి ఈశ్వర్‌కుమార్(మృతుడి కుమారుడు)ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి ప్రయత్నం చేయండన్నా(నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డితో చెప్పారు.) 
 చంద్రమ్మ: ఏదైనాపొలం ఇప్పించండి సార్!

 జగన్: మన ప్రభుత్వం వస్తే రైతు కుటుంబాలకు సహాయం చేయడానికి ముందుంటాం.
 జగన్: నీ పేరేంటి బాబూ?
 ఈశ్వర్‌కుమార్ సార్.
 జగన్: ఏమి చదువుకున్నావ్?
 ఈశ్వర్‌కుమార్ (మృతుడి కుమారుడు): ఐటీఐ ఎలక్ట్రికల్. ఏ ఉద్యోగమూ రాకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నా. హరేసముద్రం వద్ద ఉన్న శాతవాహన ఫ్యాక్టరీలో ఏమైనా ఉద్యోగం ఇప్పించండి సార్. ఇక్కడైతే అమ్మా నాన్నమ్మలకు తోడుగా ఉంటా.
జగన్: రామచంద్రారెడ్డన్న(మాజీ ఎమ్మెల్యే) ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తారు. అన్నను కలవండి.. తప్పకుండా సహాయం చేస్తారు.
Share this article :

0 comments: