మేం వస్తే సంపూర్ణ మద్యనిషేధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేం వస్తే సంపూర్ణ మద్యనిషేధం

మేం వస్తే సంపూర్ణ మద్యనిషేధం

Written By news on Tuesday, December 8, 2015 | 12/08/2015


మేం వస్తే సంపూర్ణ మద్యనిషేధం: వైఎస్ జగన్
విజయవాడ :  'ఇంతటి దారుణమైన పరిస్థితి మధ్య మాట్లాడాలంటేనే బాధ అనిపిస్తుంది. సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదో కానీ, మద్యం షాపుల తాళాలు మాత్రం కరెక్ట్ గా ఆరింటికే తెరుస్తున్నారు. రాత్రి ఒంటిగంట, తెల్లవారుజాము మూడు గంటల వరకూ షాపులు తెరుస్తూనే ఉన్నారు. ప్రజల చేత ఎంత ఎక్కువ తాగించాలనే ఉద్దేశం  ప్రభుత్వానికి ఉండటం మన దౌర్భాగ్యం. తాగించడం ఎలా ప్రభుత్వం లెక్కలు కడుతోంది. ఈ నెల ఇంతే తాగారా? వచ్చే నెల ఎంత తాగించాలని ఆలోచిస్తోంది.
 
మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది.  మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తుంటే దానికి ప్రభుత్వానిదే బాధ్యత. మరోవైపు  ఎమ్మార్పీ రేట్ల కన్నా ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ఇవన్నీ అధికారులకు తెలుసు. అందరికీ ముడుపులు అందుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యం, మద్యాన్ని అమ్మిస్తున్నారని' ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఆయన వెల్లడించారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే...
* 2014 మద్యం అమ్మకాలు రూ.6,632 కోట్లు దాటింది.
* ఈ ఏడాది అక్టోబర్ వరకూ రూ.7,050 కోట్లు దాటింది.
* 7 నెలలకు రూ.7,050 కోట్ల చొప్పున ప్రతినెల వెయ్యి కోట్లు.
* ఈ ఏడాది చివరినాటికి రూ.12 వేల కోట్లు తాగించాలని సర్కార్ డిసైడ్ అయింది.
* తన వారికే మద్యం తయారీ లైసెన్స్ లు.
* బెల్డ్ షాపులు తొలగిస్తామని సంతకం చేసి ఇప్పుడు అదే బెల్ట్ షాపుల కోసం వేలం వేస్తున్నారు.
* గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఉండే తీరు చూస్తే ఈ సొసైటీలో ఆడవాళ్లు తిరిగే పరిస్థితి లేదు.
* సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి సొంత గ్రామంలోనే బెల్ట్ షాపుకు వేలం నిర్వహించారు.
* స్కూళ్లు, దేవాలయాల ఎదుటే మద్యం షాపులా?.
* ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్తీ మద్యం విక్రయాలు.
* మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
Share this article :

0 comments: