వైఎస్సార్ రోజుల్లో రూ.1,400, 1,500 పలికిన బస్తా నేడు రైతులు రూ.600,700లకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ రోజుల్లో రూ.1,400, 1,500 పలికిన బస్తా నేడు రైతులు రూ.600,700లకు

వైఎస్సార్ రోజుల్లో రూ.1,400, 1,500 పలికిన బస్తా నేడు రైతులు రూ.600,700లకు

Written By news on Thursday, November 24, 2011 | 11/24/2011

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర
గుంటూరు : వైఎస్సార్ బతికున్న రోజుల్లో రూ.1,400, 1,500 పలికిన బస్తా ధాన్యం ధర.... నేడు రైతులు రూ.600,700లకు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెంలో గురువారం మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ సువర్ణయుగాన్ని చూసిన రైతులు ప్రస్తుత ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతన్న పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని జగన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నవారికి వ్యవసాయం, రైతు సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవాడి ఆకలి గురించి ఆలోచించిన వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన గురువారం పేరలి సభలో మాట్లాడుతూ ప్రతి అవ్వా, తాతాకు పెన్షన్ డబ్బులు చేతికందినప్పుడు కొడుకులా వైఎస్ వారికి గుర్తుకు వస్తున్నారని...పిల్లల చదువుల కోసం అప్పులు చేయకుండా ఉన్నత చదువులు చదివిస్తున్నప్పుడు తండ్రిలా వైఎస్ ఆ కుటుంబానికి గుర్తుకు వస్తున్నారన్నారు.

ఆరోగ్యం కోసం పేదలు అప్పులపాలు కాకుండా ఆదుకున్న నేత ఒక్క వైఎస్ మాత్రమేనని జగన్ అన్నారు. కేంద్రంలో సోనియా రాజ్యమేలుతున్నారంటే అది రాజశేఖరరెడ్డి చలవేనన్నారు. బతికి ఉన్నప్పుడు ఒక్కమాట కూడా అనని కాంగ్రెస్ నేడు మహానేతను అప్రతిష్ట పాలు చేయాలని టీడీపీతో కుమ్మక్కై కోర్టులో కేసులు పెడుతున్నాయని వైఎస్ జగన్ అన్నారు.


Share this article :

0 comments: