ఓదార్పు యాత్ర ఆదివారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓదార్పు యాత్ర ఆదివారం

ఓదార్పు యాత్ర ఆదివారం

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఆదివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..
20-11-2011 ఆదివారం

చెరుకుపల్లి మండలం
* పొన్నపల్లిలో యాత్ర ప్రారంభం,మూడు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
* గుళ్లపల్లిలో విగ్రహావిష్కరణ
* ఆరేపల్లిలో విగ్రహావిష్కరణ
* జొన్నలగడ్డవారిపాలెలో విగ్రహావిష్కరణ
* తుమ్మలపాలెలో విగ్రహావిష్కరణ
* చిట్టికోటిరెడ్డిపాలెలో విగ్రహావిష్కరణ
* గంజరిబోయినవారిపాలెలోవిగ్రహావిష్కరణ
* రాంభట్లవారిపాలెలోవిగ్రహావిష్కరణ
* కుంచాలవారిపాలెలో విగ్రహావిష్కరణ


నమస్తే అన్నయ్యా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా..’ అంటూ ఆ మహానేత చేత నోరారా.. పేరుపేరునా పిలిపించుకున్న వారు ఇప్పుడు ఆ రుణం తీర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఆయన తనయుడు, ఓదార్పు యాత్రికుడికి నీరాజనం పలుకుతున్నారు. వైఎస్సార్ రూపాన్ని జననేతలో చూసుకుంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాటకోసం వేలకిలోమీటర్లు సాగుతూ పేదల ఇంటి తలుపు తడుతున్న జగన్‌ను ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటున్నారు. మడమతిప్పని ఆ రాజశేఖరుడే మళ్లీ వచ్చినంత సంబర పడుతున్నారు. రాజన్న స్వర్ణయుగం త్వరలో వస్తుందని భరోసా ఇస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు.

జగన్‌కోసం జనం నిరీక్షణ ఫలించింది. ఆయన రాకతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓదార్పుయాత్ర నిర్ణీత షెడ్యూల్ కన్నా కొన్నిగంటలు ఆలస్యంగా సాగుతున్నా ప్రతీ చోట అదే జనప్రభంజనం కొనసాగుతోంది. వృద్ధులు, మహిళలు, యువకులు.. ప్రతీఒక్కరూ వయోబేధం లేకుండా జగన్‌తో కర చాలనం చేసేందుకు పోటీ పడుతున్నారు. మలివిడత నాలుగోరోజు శనివారం ఓదార్పుయాత్ర చెరుకుపల్లి మండలంలోని గ్రామాల్లో సాగింది. చెరుకుపల్లి, కనగాలలో జరిగిన సభల్లో జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఆద్యంతం మహానేత చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకు ఆయనపై ఉన్న అభిమానాన్ని వివరించారు. యాత్ర సాగిందిలా..

చెరుకుపల్లి, న్యూస్‌లైన్ : గూడవల్లిలోని స్థానికులు గోగినేని చక్రధర్‌రావు నివాసం నుంచి శనివారం ఉదయం 9.45 గంటలు జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రకు బయలుదేరారు. కనగాలకు చేరుకున్న జననేతకు హెచ్‌ఎంకేఎస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కళాశాల ఎండీ రహమాన్, ఫరూక్‌లు జగన్‌కు ముస్లిం టోపీని ధరింపజేసి సత్కరించారు. కళాశాల విద్యార్థులు జగన్‌తో కరచాలనం చేసేందుకు పెద్దఎత్తున పోటీపడ్డారు. ఈ సందర్భంగా కనగాల గ్రామస్తులు తాగునీటి సమస్యలు జగన్‌కు వివరించారు. అందరి కష్టాలు త్వరలో తీరతాయని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి పెద్దవరం చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తొలుత శ్రీరంగనాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. 

పిట్టుపాలెంలో స్వాగతం...
పిట్టుపాలెంలో జగన్‌కు ఘనస్వాగతం లభించింది. అక్కడ నుంచి బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. విజయభాస్కరరెడ్డి, వెంకటేశ్వరమ్మ దంపతుల కుమార్తెకు భార్గవ మణికంఠ అని నామకరణం చేశారు. రాజవోలు గ్రామానికి రావాలని మహిళలు పట్టుపట్టి జగన్ కాన్వాయ్‌ని ఆపే ప్రయత్నం చేశారు. నేతలు వారితో మాట్లాడారు. ఉప్పాలవారిపాలెం, కూరేటివారిపాలెం మీదుగా రాజవోలు చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు స్వాగతం పలికారు. ఎస్సీ కాలనీలో లూథరన్ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వృద్ధులు నల్లాది నాగదాసు, మండే రాఘవమ్మలు జగన్‌కు గొర్రెపిల్ల, గొంగళిని బహూకరించారు. స్థానికుడు యెండూరు బాబూ రాజేంద్రప్రసాద్ నివాసంలో అల్పాహారం విందుకు హాజరయ్యారు. అనంతరం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్‌కు జంజనం సత్యన్నారాయణ, సత్యవతి దంపతులు రాట్నం బహూకరించారు. తర్వాత కనగాల చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. అక్కడకు ఐలవరం గ్రామస్తులు చేరుకుని తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. తర్వాత తప్పక వస్తానని జగన్ ప్రకటించి అక్కడినుంచి గూడవల్లికి పయనమయ్యారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. గౌడపాలెంలోని రామమందిరంలో పూజలు నిర్వహించారు.

కుటుంబానికి ఓదార్పు..
వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన తురిమెళ్ళ అర్జునరావు కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వే శారు. అనంతరం గ్రామంలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి నడింపల్లికి చేరుకున్న జగన్, కొడాలి రంగనాయకులు నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. గౌడరామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెరుకుపల్లికి చేరుకుని దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బహిరంగసభలో రాష్ట్రప్రభుత్వం, ప్రతిపక్షపార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తర్వాత గుళ్లపల్లికి చేరుకుని తూర్పుపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పొన్నపల్లిలో పార్టీ నాయకులు లంకా ఈశ్వరరెడ్డి నివాసంలో రాత్రి బసకు చేరుకున్నారు. 

పాల్గొన్న నేతలు..
ఈ సందర్భంగా జరిగిన విగ్రహావిష్కరణలకు, సభలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మాకినేని పెదరత్తయ్య, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సినీనటులు విజయచందర్, పార్టీ నాయకులు మేరుగ నాగార్జున, ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), చిట్టా విజయభాస్కరరెడ్డి, యేటిగడ్డ నరసింహారెడ్డి, కట్టా సాంబయ్య, మారూరి రామలింగారెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మత్తి దివాకర రత్నప్రసాద్, లోయ తాండవకృష్ణ, డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, బొమ్మారెడ్డి సునీత, పాటిబండ్ల కృష్ణాప్రసాద్, జయలక్ష్మి, కావటి మనోహర్‌నాయుడు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, డైమండ్‌బాబు, మండపూడి పురుషోత్తం, నియోజకవర్గ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ధరలు షాక్ కొడుతున్నాయి..
పప్పు, ఉప్పు నుంచి రైతులకు అవసరమయ్యే ఎరువులు, పురుగుమందుల వరకు అన్నీ ధరలు పెరిగిపోయాయని.. సామాన్యులకు ఈ ధరలు షాక్ కొట్టేలా ఉన్నాయని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చెరుకుపల్లి బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పూర్తి గాలికి వదిలివేసిందని తెలిపారు. అనాలోచిత నిర్ణయాల ద్వారా విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న నీచరాజకీయాలను దేవుడు చూస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు. 108ను అటకెక్కిస్తున్న వైనాన్ని, ఇతర సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్న ప్రయత్నాలను వివరించారు. దివంగత వైఎస్సార్ ప్రజల గుండెల లోతుల్లో ఉన్నాడని ప్రజల హర్షధ్వానాల నడుమ తెలిపారు.
Share this article :

0 comments: