రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన సోనియాది అంటారేమో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన సోనియాది అంటారేమో!

రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన సోనియాది అంటారేమో!

Written By news on Saturday, November 26, 2011 | 11/26/2011


పావలా వడ్డీ పథకం ఆలోచన కిరణే ఇచ్చానంటున్నారు
రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన సోనియాది అంటారేమో!
పావలా వడ్డీ కిరణ్ బుర్రలో నుంచి వచ్చిందైతే.. రూ.800 కోట్ల బకాయిలు గుర్తులేవా?
15 లక్షల ఉద్యోగాలు ఇస్తారట.. 104 ఉద్యోగులకు, అంగన్‌వాడీలకు 2 నెలలుగా జీతాల్లేవ్..
ఆదర్శ రైతులకు 8 నెలలుగా, ఏఎన్‌ఎం నర్సులకు 5 నెలలుగా జీతాల్లేవ్..
ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద శని.. చంద్రబాబు రెండో శని..



ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఒక మాట అన్నారని ఇవాళ పేపర్లో చదివాను.. పావలా వడ్డీ పథకం ఆలోచన తానే ఇచ్చానని ఆయన చెప్పారు. రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన ఇంకో మంత్రో.. లేకుంటే సోనియా గాంధీయే ఇచ్చారని కూడా చెప్తారేమో!! ముస్లిం సోదరులకు నాలుగు శాతం రిజర్వేషన్లు తానే ఇచ్చానని మరో మంత్రో.. లేకుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారని చెప్పుకుంటారేమో! ఆ దివంగత మహానేత చేసిన మంచి పనులను కూడా దొంగతనం చేస్తారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 27వ రోజు శుక్రవారం ఆయన బాపట్ల పట్టణంతోపాటు, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 14 వైఎస్సార్ విగ్రహాలను అవిష్కరించారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆయన ప్రతి గ్రామంలోనూ ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

బకాయిల సంగతేంటి: పావలా వడ్డీ పథకం కిరణ్ కుమార్‌రెడ్డి బుర్రలో నుంచి వచ్చిన ఆలోచనైతే ఇవాళ ఆ పథకానికి రూ.1,400 కోట్లు కావాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం రూ.600 కోట్లే ఇచ్చింది. ఇంకా రూ.800 కోట్ల బకాయిలు పక్కన పెట్టి పావలావడ్డీ పథకం నాదే అని గొప్పలు చెప్పుకోవడం చూస్తే బాధనిపిస్తోంది. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని.. ఇస్తానని గొప్పలు చెప్తున్నారు. ఒకవైపు 104 కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవని, 8 నెలలుగా డీఏ లేదని సమ్మెలు చేస్తున్నారు. 

డబ్బులు ఇవ్వకపోతే 108 నడపలేమని యాజమాన్యాలే కిరణ్ కుమార్‌రెడ్డికి లేఖలు రాశాయి. అంగన్‌వాడీ వర్కర్లకు రెండు నెలల నుంచి జీతాలు లేవు.. ఆదర్శ రైతులకు కొంత మందికి ఎనిమిది నెలల నుంచి, మరి కొంతమందికి నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఇవాళే తెలిసింది. పీహెచ్‌సీలో పనిచేసే ఏఎన్‌ఎం నర్సులకు రెండు నెలల నుంచి, అర్బన్‌హెల్త్‌సెంటర్‌లో పనిచేసే వారికి ఐదు నెలల నుంచి జీతాలు లేవు. పరిస్థితి ఇలా ఉంటే గొప్పలకు అన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని అంటున్నారు.

రాష్ట్రానికి వీళ్లే శని: ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద శని. ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు రెండో శని. వీళ్లకు ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ పొలానికి వెళ్లి రైతన్నలను పలకరిస్తే.. పంట కోతకొచ్చింది. కోయాలంటేనే భయమేస్తోంది అంటున్నారు. ఎందుకని అడిగితే.. ఇవాళ బస్తా వరి ధాన్యం ధర రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఉంది.. ఈ ధరల్లో ధాన్యం అమ్ముకుంటే గిట్టుబాటు కాదని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని అధ్వానపు పరిస్థితులు ఉన్నాయి. మద్దతు ధర సంగతిలా ఉంటే.. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడి రైతులకు ఎరువులు, పొటాష్ ఎక్కువ అవసరం. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్‌లో టికెట్లు కొన్నట్లుగా రైతులు ఎరువులు కొనుక్కోవాల్సి వస్తోంది. గతంలో రూ.500 ఉన్న డీఏపీ ధర ఇవాళ రూ.వెయ్యికి పైగా పెరిగింది. ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు. రోజు రోజుకు ఈ ధరలు పైపైకి పోతున్నాయి. రైతు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర ఉండని అధ్వానపు పరిస్థితులు ఉన్నాయి. రచ్చబండ అన్నది మహానేత వైఎస్సార్ కన్న ఓ మంచి స్వప్నం. గ్రామాల్లోకెళ్లి ప్రతి పేదోడి గోడూ వినాలని ఆయన అనుకుంటే.. ఈ పాలకులు ఊళ్లల్లోకెళ్లడానికి భయపడి మండల కేంద్రాల్లోనే రచ్చబండ పెడుతున్నారు. ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసిన వాళ్లకే కార్డులు, పింఛన్లు ఇస్తున్నారు.

తొమ్మిదేళ్లలో ఏనాడూ గుర్తుకు రాలేదా బాబూ?
చంద్రబాబు నాయుడూ.. ఇవాళ కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థులకు లెక్చర్ల మీద లెక్చర్లు దంచుతున్నావు. నిన్ను ఒక్క మాట అడుగుతున్నా.. నువ్వు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక్కసారి కూడా కాలేజీలకు వెళ్లాలని, అక్కడ చదువుతున్న పిల్లల బాధలు తెలుసుకొవాలని, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసుకోవాలని ఏనాడూ నీకు అనిపించలేదా? ఇవాళ నువ్వు హూదా కమిషన్ అంటున్నావు.. స్వామినాథన్ కమిషన్ అంటున్నావు. తొమ్మిది గంటల ఉచిత కరెంటు అంటున్నావు. అర్థంకాని భాషలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఒక్క మాట అడుగుతున్నాను.. వ్యవసాయ పంపు సెట్టు హార్స్‌పవర్‌కు రూ.50 ఉన్న బిల్లును రూ.650కి పెంచిన ఘనత నీది కాదా? నీ పాలనలో మద్దతు ధర కేవలం రూ.370 నుంచి రూ.530కి పెంచావు. అదే దివంగత మహానేత ఐదేళ్ల కాలంలో రూ.530 నుంచి రూ.1,030కి పెంచారు. మద్దతు ధరకు మించి బస్తా వరి ధాన్యానికి రూ.1,400 నుంచి 1,500 వరకు ధర పలికిన ఆ దివంగత మహానేత సువర్ణయుగం ప్రతి రోజూ, ప్రతి ఘడియ మనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది.
Share this article :

0 comments: