ఓదార్పుయాత్ర శనివారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓదార్పుయాత్ర శనివారం

ఓదార్పుయాత్ర శనివారం

Written By news on Saturday, November 26, 2011 | 11/26/2011



 జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

26-11-2011 శనివారం

బాపట్ల మండలం
* కంకటపాలెం నుంచి యాత్ర ప్రారంభం 
* వెదుళ్లపల్లిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* స్టువార్టుపురంలో విగ్రహావిష్కరణ
* బేతపూడిలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
* మురుకొండపాడులో పర్యటన
* కంకటపాలెంలో విగ్రహావిష్కరణ
* నరసాయపాలెంలో విగ్రహావిష్కరణ
* జమ్ములపాలెంలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ



ఒకే రోజు 14 వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ





శుక్రవారం ఒకే రోజు అత్యధికంగా 14 వైఎస్సార్ విగ్రహాలను జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. బాపట్ల పట్ట ణంలో ఆరింటిని, రూరల్ మండల పరిధిలో ఎనిమిది విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్‌పేట, వెంగళ్‌విహార్, మున్సిపల్ కాంప్లెక్స్, ఉప్పరపాలెంరెడ్డినగర్, శాంతినగర్, దుగ్గుమల్లివారిపాలెం ప్రాంతాల్లో విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే రూరల్ మండలంలోని మచ్చావారిపాలెం, దరివాదకొత్తపాలెం, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, హనుమాన్‌నగర్, బసివిరెడ్డిపాలెం, పాండురంగాపురం, పోతురాజు కొత్తపాలెం గ్రామా ల్లో విగ్రహాలను ఆవిష్కరించారు.


జనం మేలు కోరేవారే నిజమైన నేతలు. వారినే ప్రజలు సుదీర్ఘకాలం ఆదరిస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహానేత అందుకు నిదర్శనం. ‘సమాజంలో అట్టడుగువర్గాల సమస్యలు అవగతమవ్వాలంటే వారి మధ్యకు వెళ్లాలి. వారితో మమేకం కావాలి..’ ఇది వైఎస్సార్ సూత్రం. అందుకే వేలకిలోమీటర్ల పాదయాత్రతో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అదేమాదిరి ఇప్పుడు ఓదార్పు యాత్రలో జగన్ జనంతో కలసిపోతున్నారు. వారి కష్టాలను వింటున్నారు..నష్టాలనూ తెలుసుకుంటున్నారు.. ఆయన చెప్పినట్టు... పేదరికాన్ని అతి దగ్గరగా చూస్తున్నారు. రోజులు.. గంటలు.. నిమిషాలు.. ప్రజల కోసమే అలుపూసొలుపూ లేకుండా సాగిపోతున్నారు. ఓదార్పు యాత్రలో ప్రజలను ‘మేలు’కొలుపుతున్నారు.

బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ : భావపురి ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఓదార్పుయాత్ర శుక్రవారం 27.7 కిలోమీటర్లు సాగింది. 14 వైఎస్సార్ విగ్రహాలను జననేత ఆవిష్కరించారు. అశేష జనవాహిని నడుమ శుక్రవారం రెండోవిడత పదోరోజు ఓదార్పుయాత్ర సాగిం ది. పట్టణంలోని టీచర్స్ కాలనీలో పార్టీనేత సలగల రాజశేఖర్‌బాబు నివాసం నుంచి ఉదయం 9.40గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రకు బయలుదేరారు. అంతకుముందు సలగల నివాసంలో ప్రత్యేక క్రైస్తవ ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అక్కడినుంచి ప్యాడసన్‌పేటకు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వెంగళవిహార్‌కు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పటేల్‌నగర్‌లోని దొంతిరెడ్డి జగదీష్‌కుమార్‌రెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు.

తర్వాత పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ సమీపంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
చర్చిలో ప్రార్థనలు..: అనంతరం జమ్మేదార్‌పేటలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం మక్కామసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడ మతపెద్దలు చౌకం, టోపీతో సత్కరించారు. అక్కడినుంచి ఉప్పరపాలెంరెడ్డినగర్ చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాంతినగర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పార్టీ నాయకురాలు వసుంధర నివాసానికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. 

మార్గం మధ్యలో శాంతినగర్‌లో రైల్వేగేట్ వద్ద బాపట్ల రూరల్ మండలం మచ్చావారిపాలెం గ్రామస్తులు జగన్‌ను కలిసి తమ గ్రామంలో పర్యటించాలని పట్టుబట్టారు. వారి కోరిక మేరకు జననేత ఆ గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మచ్చావారిపాలెం శివారులోని మున్నంవారిపాలెం వాసులు తమ గ్రామానికి రావాలని జగన్‌ను కోరడంతో ఆ గ్రామంలోనూ పర్యటించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. తిరిగి పట్టణంలో చేరుకుని ఏబీఎం చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దగ్గుమల్లివారిపాలెంలో..: అక్కడినుంచి దగ్గు మల్లివారిపాలెం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హయ్యర్‌నగర్ చేరుకుని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. విలియం బూత్ జూనియర్ కళాశాల విద్యార్థులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు.
బాపట్ల రూరల్‌లో..: పట్టణంలో పర్యటన ముగించుకుని రూరల్ మండలంలోని దరివాదకొత్తపాలెం చేరుకున్న జగన్‌కు జనం ఘనస్వాగతం పలికారు. దారిలో పూలతివాచీ పరిచారు. గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అక్కడినుంచి అసోదివారిపాలెం పయనమైన జగన్‌ను మార్గంమధ్యలో నాగేంద్రపురం గ్రామస్తులు స్వాగతం పలికి తమ గ్రామానికి రావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆ గ్రామంలోనూ పర్యటించారు. రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అసోదివారిపాలెం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 

మరుప్రోలువారిపాలెంలో..: గ్రామంలో మేడిబోయిన విష్ణునారాయణరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. అనంతరం మరుప్రోలువారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ్నుంచి హనుమాన్‌నగర్ చేరుకున్న ఆయన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బసివిరెడ్డిపాలెం చేరుకుని ఆ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పాండురంగాపురం చేరుకునే క్రమంలో చీరాల మండలంలోని దేవనూతల గ్రామస్తులు జగన్‌కు స్వాగతం పలికారు. పాండురంగాపురం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి పోతురాజుకొత్తపాలెం చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిరిగి కంకటపాలెం చేరుకుని స్థానికుడు షేక్ ఇస్మాయిల్ నివాసానికి రాత్రి బసకు చేరుకున్నారు.

ముఖ్యనేతలు హాజరు..: విగ్ర హ ఆవిష్కరణలకు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగర కమిటీ కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), మేరుగ నాగార్జున, పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉషా, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, సలగల రాజశేఖర్, మోదుగుల బసవపున్నారెడ్డి, దొంతిరెడ్డి మురళీగోవిందరెడ్డి, మేరిగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నా
Share this article :

0 comments: