విదేశీ చదువులకు రూ.23 కోట్లు ఇచ్చిందెవరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విదేశీ చదువులకు రూ.23 కోట్లు ఇచ్చిందెవరు?

విదేశీ చదువులకు రూ.23 కోట్లు ఇచ్చిందెవరు?

Written By news on Friday, November 25, 2011 | 11/25/2011



మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాస్తులు, విదేశాల్లోని బినామీల లావాదేవీల గుట్టును రట్టుచేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సన్నద్ధమవుతోంది. బాబు తనయుడు లోకేశ్ విదేశీ చదువులకు చెల్లింపులెలా జరిగాయి, వాటినెవరు చెల్లించారనే కోణంలో పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తోంది. మలేసియా, సింగపూర్‌లలో బాబు ఆస్తుల వివరాలతో పాటు ఆయన బినామీలైన సీఎం రమేశ్, సుజనా చౌదరి పలు దేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా కూపీ లాగనుంది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారం బాబు, ఆయన బినామీలు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులకు వారంతా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. వారందించే డాక్యుమెంట్ల తో ఈడీ సంతృప్తి చెందని పక్షంలో అదనపు సమాచారం కోరే అవకాశముంది. ఆ సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి.

విదేశీ చదువులకు రూ.23 కోట్లు ఇచ్చిందెవరు?

లోకేశ్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్‌లో మెరిట్ స్టూడెంట్ కాని ఆయనకు డొనేషన్లు కడితే తప్ప వాటిలో సీటు దక్కే అవకాశమే లేదు. దాంతో ఆ చదువులకు సుమారు రూ. 23 కోట్ల దాకా ఖర్చు చేశారు. లోకేశ్ చదువుకు, అక్కడ ఉండేందుకు అయిన ఖర్చును చంద్రబాబు గానీ, లోకేశ్ గానీ తమ రిటర్నుల్లో ఎన్నడూ చూపించలేదు. మరి అలాంటప్పుడు వాటికి చెల్లింపులు ఎక్కడ నుంచి జరిగాయనే గుట్టును ఈడీ రట్టు చేయనుంది. బాబు కుమారుని విదేశీ చదువుల కోసం సత్యం కంప్యూటర్స్ అధిపతి రామలింగరాజు డొనేషన్లు చెల్లించారని రాష్ట్ర రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో అంతా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ‘చదివింపు’లను సత్యం రామలింగరాజు ద్వారా పొందలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత లోకేశ్, బాబులదే! అలా నిరూపించుకోవాలంటే డొనేషన్లను ఏ ఖాతాల నుంచి చెల్లించినదీ ఈడీకి ఆధారాలతో సహా చూపించాల్సి ఉంటుంది. 2001లో మేజర్ అయిన లోకేశ్‌కు హెరిటేజ్ ఫుడ్స్‌తో పాటు 15 కంపెనీల్లో షేర్లున్నాయి. హెరిటేజ్‌లో ఆయనకు ఏకంగా 9 శాతం వాటా ఉంది. నెల్లూరు జిల్లా నిండలిలో 2001కి ముందే భూములు కొనుగోలు చేశారు. 2006లో ముంబై, బె ంగళూరుల్లో ఎకరాల కొద్దీ కొనుగోలు చేసినట్టు కూడా సమాచారం. ఈ వ్యవహారాల గుట్టంతా ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి రానుంది.

సింగపూర్‌లో బాబు హోటల్: బాబుకు 2001లోనే సింగపూర్‌లో హోటల్ ఉన్నట్టు తెహల్కా డాట్‌కామ్ వెల్లడించింది. పార్క్ హోటల్ క్లార్క్‌క్వే పేరుతో ఉన్న ఆ హోటల్‌లో 100 శాతం వాటా ఈగిల్ ఫోర్స్ ప్రాఫిట్స్ లిమిటెడ్ అనే కంపెనీదే! దాని తాలూకు అసలు లబ్ధిదారు బాబే అంటూ వచ్చిన వార్తలపైనా ఈడీ పూర్తిస్థాయి సమాచారం రాబట్టనుంది. బాబు హయాంలో రాష్ట్రంలో పనులు చేపట్టడానికి వచ్చిన ఐజేఎం కార్పొరేషన్, ఐఓఏ ప్రాజెక్ట్స్, జురాంగ్ ప్రాజెక్ట్స్ వంటివన్నీ నిధుల్ని మారిషస్ మార్గంలోనే తెచ్చుకున్నాయనే ఆరోపణలున్నాయి. వాటి భారతీయ ప్రతినిధులు టీడీపీ అత్యంత సన్నిహితులు కావడం ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తోంది. ఐజేఎం ఇండియా రామలింగరాజు కుటుంబీ కులది. కాగా ఐఓఏ ఇండియా 2009లో టీడీపీ టికెట్‌పై అసెంబ్లీకి పోటీ చేసిన రమేశ్ సోదరుడు చుక్కపల్లి సురేశ్‌ది. ఆయనకు బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన రెండున్నర ఎకరాల స్థలాన్ని బాబు హయాంలో కారుచౌకగా ఏపీ జెమ్స్ అండ్ జ్యూయెలరీ పార్క్ కోసం కట్టబెట్టారు. అందులో ప్రభుత్వ వాటా 11 శాతం. కాగా మిగతాది సురేశ్‌ది. దీనికి మారిషస్ నుంచి నిధులు వచ్చాయి. ఈ వ్యవహారం మొత్తాన్నీ మనీ లాండరింగ్ (నగదు అక్రమ తరలింపు) కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. బాబు జీవితకాల ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు విదేశాల నుంచి అందిన విరాళాలు, వాటిని టీడీపీకి ఉపయోగించిన వైనం కూడా వెలుగులోకి రానుంది.

http://www.youtube.com/watch?v=iQXJgoewYg4&feature=player_embedded
నోటీసులతో బాబు బృందం హైరానా

తమకు ఈడీ నోటీసులు వచ్చాయని తెలియగానే చంద్రబాబు, ఆయన కుటుంబీకులు, బినామీలు నానా హైరానా పడ్డారు. ఈడీ ప్రతినిధులు మంగళవారం నేరుగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లి నోటీసులు అందించారు. కానీ బాబు, లోకేశ్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వారు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈడీ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని బాబు ఇంటికి వెళ్లగా, నోటీసులందుకునేందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అన్నారు. ‘సార్ చెప్పనిదే నోటీసులు తీసుకోం’ అంటూ మొరాయించారు. తీసుకోకుంటే ఇంటికి అంటించి వెళ్తామని ఈడీ ప్రతినిధులు కరాఖండీగా చెప్పినట్టు సమాచారం. దాంతో బాబుతో సిబ్బంది ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత నోటీసులను హెరిటేజ్ ప్రధాన కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా ఈడీ ప్రతినిధులకు చెప్పారు. తీరా అక్కడికెళ్తే, ‘సార్ మాకు చెప్పలేదు’ అంటూ హెరిటేజ్ సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. దాంతో ఈడీ ప్రతినిధులు విసిగిపోయారు. మళ్లీ బాబు ఇంటికే వెళ్లి నోటీసులను గోడపై అంటించేందుకు సమాయత్తమయ్యారు. అప్పుడు ఎట్టకేలకు సిబ్బంది నోటీసులు తీసుకోవాల్సి వచ్చింది!
Share this article :

0 comments: