బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభం

బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభం

Written By news on Friday, November 25, 2011 | 11/25/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి ప్రారంభమవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

25-11-2011 శుక్రవారం బాపట్ల పట్టణం
బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభం 

ప్యాడిసన్‌పేటలో వైఎస్ విగ్రహావిష్కరణ

వెంగళ్‌విహార్‌లో విగ్రహావిష్కరణ

మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద విగ్రహావిష్కరణ

ఉప్పరపాలెంరెడ్డినగర్‌లో విగ్రహావిష్కరణ

శాంతినగర్‌లో విగ్రహావిష్కరణ

దగ్గుమల్లివారిపాలెంలో విగ్రహావిష్కరణ

బాపట్ల రూరల్ మండలం
ఆసోదివారిపాలెంలో విగ్రహావిష్కరణ

దరివాద కొత్తపాలెంలో విగ్రహావిష్కరణ

మరుప్రోలువారిపాలెంలో విగ్రహావిష్కరణ

హనుమాన్‌నగర్‌లో విగ్రహావిష్కరణ

పాండురంగాపురంలో విగ్రహావిష్కరణ

బసివిరెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణ

పోతురాజుకొత్తపాలెంలో విగ్రహావిష్కరణ

వెదుళ్ళపల్లిలో విగ్రహావిష్కరణ

 కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నా..
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి తనకు మింగుడు పడడంలేదని.. దీంతో ఆ పార్టీలో ఇమడలేక పోతున్నానని కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మారుపూడి లీలాధర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 

మండలంలోని చింతలపూడిలో గురువారం కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నాక పార్టీ మారే ఆలోచన మనసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. నియోజకవర్గానికి అధికార కాంగ్రెస్ వీసమెత్తు అభివృద్ధి కూడా చేయలేదని చెప్పారు. మండలాల్లోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలో ప్రస్తుత నాయకులు తన మాటను పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పెత్తనం చెలాయిస్తున్న నేతలు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పారు. 

నియోజకవర్గ ఇన్‌చార్జిగా కేవలం లక్షరూపాయల అభివృద్ధి పనులు కూడా ఇక్కడ చేయలేకపోవడం బాధగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మునిసిపల్ చైర్మన్ పొట్లూరి శ్రీహరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండ్రు అనిత, కావేటి అంజలి, పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌ఎం బాషా, షేక్ జాకీర్‌హుస్సేన్, లంకపోతు పిచ్చిరెడ్డి, యానాదిరావు పాల్గొన్నారు.
Share this article :

0 comments: