నీతి నియమాలంటే లీకులేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీతి నియమాలంటే లీకులేనా?

నీతి నియమాలంటే లీకులేనా?

Written By news on Friday, June 29, 2012 | 6/29/2012


నైతికంగా దెబ్బతీస్తున్నారన్న సీబీఐ జేడీ ఫిర్యాదుపై సర్వత్రా విస్మయం
ఓ వర్గం మీడియాకు కావాల్సిన లీకులివ్వటం నిజం కాదా?
వీలైనంత విషం కక్కేలా వాళ్లని ప్రోత్సహించటం అబద్ధమా?
ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది?
ఈ తీరు వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాధపడ్డాయో తెలుసా?
లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్టర్లు కూడా దెబ్బతిన్నారని మీకు తెలియదా?
వాళ్లకు వ్యక్తిగత స్వేచ్ఛలు లేవా? వాళ్లవి ప్రైవేటు జీవితాలు కావా?
ఎమ్మార్ కేసులో అసలు కుట్రదారు బాబునెందుకు విచారించరు?
ఐఎంజీ దర్యాప్తునకు తగినంత సిబ్బంది లేరని చెప్పటం నిజమేగా!
వైఎస్ దుర్మరణం కేసు దర్యాప్తును మూడు నెలల్లోనే ముగించారేం?
ఎన్నికల ముందు జగన్ అరెస్టు.. ప్రచారాన్ని అడ్డుకోవటానికి కాదా?
అరెస్టు అధికార, విపక్షాలకు లబ్ధి చేకూర్చడానికే అన్నది నిజం కాదా?
ఇవి నైతికతకు సంబంధించిన ప్రశ్నలు కావా? ఎవరిది అనైతికత?

కాల్ డేటా వివరాలు లీకయ్యాయంటూ సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తనను నైతికంగా దెబ్బతీయటానికే ఇదంతా చేస్తున్నారని పేర్కొనటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. రాజ్యాంగం తనకు కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దెబ్బ తీస్తున్నారని, కపటంతో దర్యాప్తును ప్రభావితం చేయటానికి కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నట్టుగా గురువారం ‘ఈనాడు’ పత్రిక పతాక స్థాయి కథనాన్ని ప్రచురించింది. కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న తనను.. నైతికంగా దెబ్బ తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా అందులో జేడీ పేర్కొన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు తీరుతెన్నులపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం కావటం.. ఓ వర్గం మీడియా సాయంతో ైవె ఎస్సార్ కుటుంబాన్ని, అభిమానుల్ని, ‘సాక్షి’ని లక్ష్మీనారాయణ టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజా ఆరోపణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ఎవరిదండీ అనైతికం? జగన్‌ను దోషిగా నిరూపించాలని సీబీఐ ముందే నిర్ణయం తీసేసుకుని.. దాన్ని అమలు చేయటానికి నిబంధనల్ని గాలికొదిలేసి.. ఓ వర్గం మీడియాకు తాను చెప్పాలనుకున్నది చెబుతూ.. వీలైనంత విషం కక్కేలా వాళ్లని ప్రోత్సహిస్తూ దురుద్దేశపూరితంగా వార్తలు రాయించటం నిజం కాదా? ఇదంతా ఒక వ్యక్తిని అప్రతిష్టపాలు చేయటానికి పన్నిన లోతైన కుట్ర కాదా? విచారణలో భాగంగా ఒక గదిలో ఇద్దరు మాట్లాడిన అంశాలు కూడా బయటకు యథాతథంగా రాలేదా? జగన్‌ను, ఆయన కుటుంబీకుల్ని, బంధుమిత్రుల్ని, అభిమానుల్ని మానసికంగా దారుణంగా దెబ్బతీసేలా ఆ వర్గం మీడియాలో కథనాలు రాలేదా? సీబీఐ చెప్పిందంటూ వాళ్లు రాసిన కథనాల్ని లక్ష్మీనారాయణ సహా ఏ ఒక్క అధికారీ ఎందుకు ఖండించలేదు? ఏం! ఢిల్లీ పోలీసులు సైతం తమకు సంబంధించిన వార్తేదైనా వెలువడితే అది నిజమో కాదో వివరణ ఇస్తున్నారుగా! కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థకు ఆ మాత్రం బాధ్యత లేదా? పెపైచ్చు సదరు మీడియా ప్రతినిధులకు లక్ష్మీనారాయణ ఫోన్లు చేయటం నిజం కాదా? కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నానంటున్న అధికారికి అంత సమయం ఎక్కడుంది? మీడియాకు తనంతట తాను అన్నేసిసార్లు ఫోన్లు చేసి మరీ విషయాల్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలా చేయడం ద్వారా కొన్ని లక్షల మందిని మానసికంగా దెబ్బ తీయటం అబద్ధమా? ఈ అడ్డగోలు కథనాల వల్ల జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల తాలూకు లిస్టెడ్ కంపెనీలు కూడా తీవ్రంగా దెబ్బ తినలేదా? వాటిలో పెట్టుబడులు పెట్టిన చిన్న చిన్న ఇన్వెస్టర్ల మాటేమిటి? ఇవేవీ లక్ష్మీనారాయణకు క నిపించలేదా? ఏం! వారికి రాజ్యాంగం వర్తించదనుకుంటున్నారా? స్వేచ్ఛగా బతికే హక్కు వారికి మాత్రం లేదా? మీ దర్యాప్తు మీరు చేయకుండా మీడియానెందుకు ఆశ్రయిస్తున్నారు?’’ అని కేసు పూర్వాపరాలను తొలి నుంచీ గమనిస్తూ వస్తున్న పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

కేసేదైనా టార్గెట్ వైఎస్ కుటుంబమే!


నిజానికి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తూ ఏ కేసునైనా ఒకేలా చూడాల్సిన సీబీఐ.. చంద్రబాబుకు మాత్రం ప్రాణ స్నేహితుడిలా ప్రవర్తిస్తోందని గతంలోనే విమర్శలొచ్చాయి. ఎందుకంటే జగన్ కేసుల్లో క్షణం కూడా వృథా కాకూడదన్నట్లుగా రెండు వారాల్లోనే కోర్టుకు నివేదిక ఇవ్వటం.. కోర్టు దర్యాప్తుకు ఆదేశించిన గంటల వ్యవధిలో మూకుమ్మడి దాడులతో ఇన్వెస్టర్లను, వైఎస్సార్ కుటుంబీకుల్ని భయభ్రాంతుల్ని చేయటం తెలిసిందే. ఆఖరికి ఎమ్మార్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తూ కూడా జగన్ సన్నిహితులనే టార్గెట్ చేశారు తప్ప.. నిబంధనల్ని గాలికొదిలేసి టెండర్ల దశ నుంచే కుట్రపూరితంగా వ్యవహరించిన చంద్రబాబును మాత్రం విచారించనేలేదు. చివరకు సింగిల్ టెండర్ మిగిలేలా చక్రం తిప్పి.. హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.28 లక్షల చొప్పున సీఎం హోదాలో బాబు విక్రయించేశారు. అది కూడా ఏ పరిశ్రమకో, వేల మందికి ఉపాధి కల్పించటానికో కాదు.. విల్లాలు కట్టుకొని అమ్ముకోవటానికి! అయినా సరే.. ఈ వ్యవహారంలో 2004 కన్నా ముందు ఏం జరిగిందనేది తమకు అనవసరమన్నట్టుగా సీబీఐ మొండిగా వ్యవహరించింది. చివరికి సుప్రీంకోర్టు చెప్పినా సరే, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ బాగోతాన్ని ప్రస్తావిస్తున్న వర్గాలు.. మరి ఇదెంత వరకూ నైతికమని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. పెపైచ్చు బాబు హయాంలో జరిగిన వ్యవహారాల్ని తప్పుబడుతూ, వాటిపై విచారణ జరపాలంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పుడు.. దానిపై మీనమేషాలు లెక్కిస్తూ మూడు వారాల దాకా సీబీఐ ముందుకు కదలకపోవడాన్ని, కనీసం అటువైపు దృష్టి కూడా సారించకపోవడాన్ని ఆ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

రూ.43 వేల కోట్లంటూ అడ్డగోలు ఆరోపణలు! 

సీబీఐ బుధవారం చేసిన వాదననే ఓ తీర్పు మాదిరిగా గురువారం ‘ఈనాడు’ ప్రచురించింది. ‘43 వేల కోట్ల దోపిడీ’ అంటూ పెద్దగా హెడ్డింగు పెట్టేసింది. గురువారం జగన్‌ను కలిసిన న్యాయవాదులు ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించగా, ‘‘పత్రిక నడపడం ఇప్పటికే కష్టంగా ఉంది. పోనీ 43 వేల కోట్లెందుకు... దాన్లో పావలా వంతు ఇచ్చినా మొత్తం ఆస్తుల్ని తీసుకోమని ఎవరికైనా బంపర్ ఆఫరివ్వండి’’ అని ఆయన నవ్వుతూ కొట్టిపారేయడం గమనార్హం. దర్యాప్తు మొదలై 10 నెలలు గడుస్తున్నా ఇంకా ఫిర్యాదులోని ఆరోపణల్నే ప్రస్తావిస్తూ నెట్టుకురావడం, ఏదీ తేలకపోయినా, ఏదో జరిగిపోతోందన్నట్టుగా మీడియాలో కథనాలకు ఆస్కారమిచ్చేలా వాదనలు చేయటం.. ఇవన్నీ సీబీఐ తీరుతెన్నుల్ని బహిరంగంగా బయటపెడుతున్నవే. వాటి లోగుట్టును కూడా చెప్పకనే చెబుతున్నవే!

లక్ష్మీనారాయణది పక్షపాతం కాదా? 

చంద్రబాబు అధికారం నుంచి తప్పుకునే ముందు.. ఆఖరి క్షణాల్లో ‘ఐఎంజీ అకాడెమీస్ భారత’ అనే డమ్మీ కంపెనీని సృష్టించి.. ఫ్లోరిడాలో ఉన్న ఐఎంజీ సంస్థకు అది అనుబంధమంటూ బొంకారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఫ్లోరిడా సంస్థకు, దీనికి ఎలాంటి సంబంధమూ లేదని తెలిసి.. ఇది బాబు బినామీల ద్వారా సాగించిన మోసమని తెలిసి దానిపై సీబీఐ విచారణ కోరారు. అయినా దానిపై విచారణకు సీబీఐ ముందుకు రాలేదు. కారణమేంటని ఆరా తీస్తే.. తమవద్ద తగినంత మంది సిబ్బంది లేరని ఇదే లక్ష్మీనారాయణ నేతృత్వంలోని సీబీఐ కేంద్రానికి చెప్పినట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. 

‘‘మరి ఇది ఎంతవరకూ నైతికం? బాబుపై మీ ప్రేమకు ఇది కూడా ఒక నిదర్శనం కాదా? వైఎస్ మరణించిన ఘటనపై మీ నేతృత్వంలోనే విచారణ జరిగింది. తప్పేమీ జరగలేదని కేవలం మూడంటే మూడే నెలల్లో తేల్చేశారు. అసలు వైఎస్సార్ మరణించడానికి ఒక్క రోజు ముందు చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ, ‘ఎవరు ఫినిష్ అవుతారో చూద్దాం’ అంటూ వైఎస్‌కు నేరుగా సవాలు విసిరారు. దాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో చాలా ప్రాధాన్యమిచ్చి మరీ ప్రచురించింది. ఇదే చంద్రబాబు మన రాష్ట్ర గ్యాస్ నిల్వలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు దక్కటానికి యథాశక్తి సహకరించి తరించారు. గుజరాత్ మాదిరిగా పోటీ పడటానికి ముందుకు రాలేదు కూడా. అందుకని వాళ్లు చంద్రబాబుకు రుణ పడి... ఆ తర్వాత రూ.1,800 కోట్ల సంచిత నష్టాల్లో ఉన్న ‘ఈనాడు’లో రూ.100 విలువైన షేరును ఒక్కోటీ ఏకంగా రూ.5,28,630 చొప్పున కొనుగోలు చేసి దాన్ని తీర్చుకున్నారు. మరోవంక వైఎస్సార్ మాత్రం గ్యాస్ రేట్లు తగ్గించాలని రిలయన్స్ సంస్థతో అలుపులేని పోరాటం చేశారు. అటువైపేమో అనిల్ అంబానీని చంపడం కోసం ఆయన హెలికాప్టర్ ఫ్యూయల్ ట్యాంక్‌లో రాళ్లు వేయటం.. తర్వాత దాన్ని కనుక్కున్న ఇంజినీర్ రైలు పట్టాలపై శవమై కన్పించడం వంటివెన్నో జరిగాయి. అసలు ఇలాంటివన్నీ విచారణలో భాగమేనని మీకెందుకు అనిపించలేదు? సమగ్రంగా శోధించి కదా తప్పు జరిగిందో లేదో తేల్చాల్సింది!! అలా చేయకపోవటం అనైతికమని మీకు అనిపించలేదా?’’ అని ఈ వ్యవహారాన్ని తప్పు పడుతున్న వర్గాలు గట్టిగా నిలదీస్తున్నాయి. పైగా చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐపీఎస్ మాజీ అధికారులతో లక్ష్మీనారాయణ ఇప్పటికీ చాలా సన్నిహితంగా ఉంటున్నారనే విమర్శలున్నాయని, ఇలా చేయటం ఎంతమాత్రం నైతికం కాదని వారంటున్నారు.

అరెస్టుపై సర్వత్రా విమర్శలే.. 

ఆగస్టులో దర్యాప్తు మొదలు కాగా అప్పటి నుంచి సీబీఐ ఏకంగా మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ ఏడాది మే 25 వరకూ ఈ కేసులో ఒక్కసారి కూడా జగన్‌ను విచారించలేదు కూడా. అలాంటిది.. కేవలం ఉప ఎన్నికలు ఇంకా 15 రోజుల్లో ఉన్నాయనగా ఆయన్ను విచారణ కోసమంటూ పిలవడం, కోర్టులో మర్నాడు హాజరవుతారనగా... అందుకు కేవలం కొన్ని గంటల ముందు అంటే మే 27న అరెస్టు చేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘‘ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్‌కు బురద అంటించాలని, ఆయన్ను తిరగనీయకుండా చేసి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆయనపై చల్లే బురద మాత్రమే ప్రజలకు కన్పించేలా చేయాలని పన్నిన కుట్రే కాదా ఇది? అందులో భాగస్వామిగా మారడం ద్వారా అధికార, ప్రతిపక్ష పార్టీలకు మేలు చేయాలని మీరు భావించలేదా? జగన్ ఏం చెప్పినా అది వినిపించకుండా చేయాలనే ఆలోచన తప్ప ఇందులో వేరే కారణమేముంది? 10 నెలలుగా సాక్ష్యాల్ని తారుమారు చేయని వ్యక్తి ఉన్నట్టుండి అలా చేస్తారని మీకెందుకు అనిపించింది? ఎన్నికలు రాబట్టే కదా? జగన్ ఎంపీ కాబట్టి, ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఇలా చేస్తారనటం ఎలాంటి నైతికతకు నిదర్శనం? పైగా ఈ ఆరోపణలనే ఆధారంగా చూపుతూ అరెస్టు చేయటమే నీతి నియమాలకు ప్రతీకా?’’ అని వైఎస్‌ను అభిమానించే వారంతా ప్రశ్నిస్తున్నారు. సీబీఐ తన దర్యాప్తు తాను చేసుకుంటూ వెళ్తే.. బురదజల్లే కథనాలపై మీడియాను నియంత్రించి ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండేవి కావని వారంటున్నారు. ‘‘దర్యాప్తు ముసుగులో ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు బజారుకీడ్చారో, ఎందరు గౌరవనీయ వ్యక్తుల మనసుల్ని గాయపరిచారో, ఎన్ని కుటుంబాల్ని అప్రతిష్టపాలు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ లీకుల కథనాల్ని మరొక్కసారి తిరగేయండి. వారి బాధేమిటో అప్పుడైనా మీకు తెలుస్తుంది’’ అని హితవు పలికారు.
Share this article :

0 comments: