రామచంద్రపురం..అధికార పార్టీ ఆగడాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామచంద్రపురం..అధికార పార్టీ ఆగడాలు

రామచంద్రపురం..అధికార పార్టీ ఆగడాలు

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

ఏజెంట్ల కోసం తయారు చేసిన ఉప్మా, పలావులు నేలపాలు 
మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం కంటే ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు అధికంగా తరలివచ్చారు. పలు పోలింగ్‌బూత్‌లలో ఈవీఎంలు మొరాయించటంతో ఆయా చోట్ల పోలింగ్ సుమారు గంట నుంచి రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. రామచంద్రపురంలోని స్టీల్‌విల్‌పేట, ఏరుపల్లిలలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పిల్లా వెంకన్న, సుందరపల్లి శ్రీను, భీమశంకరం, ఆదినారాయణ తీవ్రగాయాలపాలయ్యారు. 

క్షతగాత్రులు ప్రస్తుతం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలింగ్ బూత్‌లకు సమీపంలో ఉన్నారన్న సాకుతో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రామచంద్రపురం మండలం నరసాపురప్పేటలో ఏజెంట్ల కోసం తయారుచేస్తున్న ఉప్మాను పిఠాపురం సీఐ రాంబాబు నేలపాలు చేశారు. ఆదివారపుపేటలో తయారుచేస్తున్న పలావు బేసిన్లను, వేగాయమ్మ పేటలో అల్పాహారం చేస్తున్న సామగ్రిని పోలీసులు చిందరవందర చేసి వంట చేసే వారిపై లాఠీలు ఝుళిపించారు.

కాజులూరు సెంటర్‌లో ‘సాక్షి’ టీవీకి చెందిన ఓబీ వ్యాన్‌ను ఉంచటానికి వీల్లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిసేపు గలాటా సృష్టించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ నేతలు ఎర్రపోతవరంలో మద్యం, కుయ్యేరు ఎస్సీపేటలో ఓటుకు రూ. 500 చొప్పున పంపిణీ చేశారు. ఈ రెండుచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించటంతో కొద్దిపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంపిణీకి సిద్ధంగా ఉంచిన 910 మద్యం బాటిళ్లను అనపర్తి నియోజకవర్గ పరిధిలోని బిక్కవోలు మండలం ఊలపల్లిలో ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
Share this article :

0 comments: