నార్కో ‘మత్తు’లో సీబీఐ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నార్కో ‘మత్తు’లో సీబీఐ!

నార్కో ‘మత్తు’లో సీబీఐ!

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

చేసిన తప్పునే పదిసార్లు చేస్తే అది ఒప్పు అవుతుం దా? ఒకే అబద్ధాన్ని పలుమార్లు చెపితే అది నిజమవు తుందా? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెప్పకతప్ప దు. నిందితుడిపై నార్కో అనాలిసిస్ పరీక్షలు జరప డం రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కులకు భంగకర మని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా తీర్పు చెప్పిం ది. ఈ తీర్పును దేశంలోని న్యాయస్థానాలన్నీ పరిగ ణనలోకి తీసుకొని నడుచుకోవాల్సిందే. ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇప్పటి వరకు సమీక్షించలేదు. అలాంట ప్పుడు తమకు కావాల్సిన సమాచారం ఇవ్వడం లేదు కాబట్టే నిందారోపణలు మాత్రమే ఎదుర్కొంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నార్కో అనాలిసిస్ పరీక్షలకు గురిచేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పిటిషన్‌ను దాఖలు చేయ డం ఎలా సబబు? సుప్రీంకోర్టు తీర్పు తెలియక ఈ పిటిషన్‌ను దాఖలు చేసిం దనుకోవాలా? లేనిపక్షంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మారారు కాబట్టి పిటిషన్‌పై తీర్పు ఇంకో విధంగా ఉంటుందని భావించి పిటిషన్‌ను దాఖలు చేసినట్లు భావించాలా?

నిందితుడిపై సత్యశోధన పరీక్ష నిర్వహించడం అశాస్త్రీయం. మానవ హక్కులకు భంగకరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3)కు విరుద్ధమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ‘సాక్షి’ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డిపై సత్యశోధన పరీక్షలకు అనుమతించాలంటూ గతంలో సీబీఐ వేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. విచిత్రంగా సీబీఐ తన తాజా పిటిషన్‌లో వియజసాయిరెడ్డిపై కూడా సత్యశోధన పరీక్షలకు అను మతించాలని కోర్టును అభ్యర్థించింది. జగన్‌తోపాటు విజయసాయిరెడ్డిపై పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కోర్టును సీబీఐ ఆశ్రయించింది.

విజయసాయిరెడ్డిపై నార్కో పరీక్ష జరపడానికి సీబీఐకి అనుమతిని నిరా కరిస్తూ, ఈ పరీక్ష సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలో తీర్పుచెప్పింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత తిరిగి అదే అభ్యర్ధనతో అదే కోర్టులో మరోసారి పిటిషన్‌ను దాఖలు చేయడంలోని మర్మం ఏమిటి? గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మరో రకమైన తీర్పును సీబీఐ కోర్టు ఇవ్వవచ్చునా? ఇది గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించటం అవదా? అలా సమీక్షించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉందా? న్యాయమూర్తి మారారు కాబట్టి, తాజా పిటిషన్‌ను దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇది సమీక్ష కిందకు రాదని సీబీఐ వాదించవచ్చు.

సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ విధంగా వ్యవహరించడం చట్ట నిబంధనలను బేఖాతరు చేయటమే. ఇది న్యాయ స్ఫూర్తికి విరుద్ధం. న్యాయమూర్తులు వేరైనా, కోర్టులు వేరైనా చట్టం చట్టమే. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను దేశంలోని దిగువ కోర్టులు, న్యాయమూర్తులు అనుసరించాల్సిందే. అలాంటప్పుడు తెలిసి తెలిసి ఇలా పిటిషన్లను దాఖలు చేయడం ఎంత వరకు సమర్థనీయం? న్యాయస్థానాల విలువైన సమయాన్ని వృథా చేయడంకాదా?

నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి ‘మౌనంగా ఉండే హక్కు’ రాజ్యాం గంలోని ఆర్టికల్ 20(3) కల్పించింది. వ్యక్తి చేత బలవంతంగా నేరం అంగీకరిం పజేయడం రాజ్యాంగ విరుద్ధం. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిందితుడిని బలవంతపెట్టి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి, మత్తు ఎక్కించి అతని నుంచి సాక్ష్యం సేకరించే అధికారాన్ని చట్టం పరిశోధనా సంస్థలకు కల్పించలేదు. భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం పోలీస్ అధికారి ఎదుట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానాలు సాక్ష్యంగా పరిగణించజాలవు.
సత్యశోధన పరీక్షలు, బ్రెయిన్ మ్యాపింగ్, మత్తు పదార్థాలను ఎక్కించి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి సమాచార సేకరణ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజాప్రయోజనాల పేరుతో ఒక వ్యక్తిపై అశాస్త్రీయమైన నార్కో పరీక్షలను నిర్వహించడమంటే... తనకు విరుద్ధంగా తానే సాక్ష్యం చెప్పి స్వీయ విఘాతానికి అతను పాల్పడేట్లు చేయడమే. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3)కు విరుద్ధం.
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఎటువంటి చర్యలనైనా భారత న్యాయస్థానాలు సమర్థించవు. 

ఒక వ్యక్తిని నార్కో పరీక్షలకు గురికావాలని బలవంత పెట్టడం అమానవీయ చర్యగా, క్రూర చర్యగా వ్యక్తిని కించపరచే చర్యగా పరిగణించాలని అంతర్జాతీయ మానవ హక్కుల నిబం ధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వ్యక్తిని అపస్మారక స్థితిలోకి పంపి సేకరించిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థ సాక్ష్యంగా ప్రవేశపెట్టడం స్వచ్ఛమైన విచారణ హక్కుకు భంగకరమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలా సేకరించిన సమాచా రాన్ని అసలు పరిగణనలోకి తీసుకోజాలమని కేరళ హైకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. సమాచార సేకరణ పేరుతో, వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది.

‘సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ కేసులో సుప్రీంకోర్టు నార్కో పరీక్షలను, బ్రెయిన్ మ్యాపింగ్, ఇతర సత్యశోధన పరీక్షల విషయంలో జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు ఇలా ఉన్నాయి.

క్రిమినల్ కేసు దర్యాప్తు పేరుతో ఏ వ్యక్తిని కూడా సత్యశోధన పరీక్షలకు గురిచేయరాదు.
స్వచ్ఛంద అనుమతి లేకుండా ఏ వ్యక్తిపై కూడా సత్యశోధన పరీక్ష నిర్వహించరాదు.

ఎవరైనా వ్యక్తి స్వచ్ఛందంగా సత్యశోధన పరీక్షకు అంగీకరిస్తే అది అతని తరఫు న్యాయవాది సమక్షంలో మాత్రమే నిర్వహించాలి.

అంతేగాక సత్యశోధనకు అనుమతించిన వ్యక్తి ఆమోదాన్ని ఒక మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. ఇది ఒక స్వతంత్ర సంస్థ ద్వారా మాత్రమే జరిపించాల్సి ఉంటుంది. అంతేగాక సత్యశోధన పరీక్షకు గురికావడానికి అంగీకరించిన వ్యక్తికి ఆరోగ్యరీత్యా అందువలన సంభవించే దుష్పరిణా మాలను వివరించాల్సి ఉంటుంది.

నార్కో పరీక్షలు చెల్లవని, రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు ప్రకటిం చినా దర్యాప్తు సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చూస్తే ఈ సంస్థకు అసలు చట్టంపై అవగాహన ఉందా అనే సందేహం కలుగకమానదు.

నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించరాదని చట్ట నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సత్యశోధన పరీక్షలు నిర్వహించడం కూడా థర్డ్‌డిగ్రీని ప్రయోగించడమేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. విజయసాయిరెడ్డి విషయంలోనైతే ఆయనపై పరీక్షల నిర్వహణను నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు సరైంది కాదని భావిస్తే సీబీఐ ఈ తీర్పుపై హైకోర్టుకు, అనంతరం సుప్రీంకోర్టుకు అప్పీలుకు లేదా రివిజన్‌కు వెళ్లాలి. అలా కాకుండా తాజాగా అదే కోర్టులో మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. జగన్‌పై నార్కో పరీక్షలకు అనుమతిని కోరుతూ పనిలోపనిగా విజయసాయిరెడ్డిపై కూడా నార్కో పరీక్షలకు అనుమతించాలని అభ్యర్థించింది. జగన్‌ను, విజయ సాయిరెడ్డిని సీబీఐ కోర్టు అనుమతితో తన కస్టడీలో పెట్టుకుని సీబీఐ సుదీర్ఘ విచారణ జరిపింది. ఆ తతంగం పూర్తి అయినందున ‘నార్కో పరీక్షల’ నిర్వహణకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించింది.

‘‘వ్యక్తి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. దర్యాప్తు పేరుతో, విచారణ పేరుతో నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులను జైళ్లలో ఎక్కువ కాలం నిర్బంధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్ధమని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పును వెలువరించింది. నిందితుడికి శిక్షపడిన తర్వాతే అతను జైలులో శిక్ష అనుభవించాలి తప్ప నేరారోపణల దశలో కాదని న్యాయస్థానాలు అనేక కేసుల్లో తీర్పు చెప్పాయి. ఇటీవల సుప్రీంకోర్టు ‘సంజయచంద్ర’ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ, కొన్ని ప్రత్యేక కారణాలతో మాత్రమే నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని జైలులో ఉంచాలని స్పష్టం చేసింది. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని సుదీర్ఘ కాలం జైలులో పెట్టడమంటే ‘ఆర్టికల్ 21’కి భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది.

నేర పరిశోధన, నేర సమాచార సేకరణ పరిశోధన సంస్థల బాధ్యత, విధి. అయితే బాధ్యతల నిర్వహణ పేరుతో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా చూసినా ఆమోదయోగ్యం కాదు.
‘స్వీయ విఘాతం’ కల్పించే సమాచారాన్ని చెప్పమని నేరారోపణ ఎదు ర్కొంటున్న వ్యక్తిని ఆదేశించాల్సిందిగా కోర్టును ఆశ్రయించడం సమర్థనీయం కాదు, కాజాలదు. జగన్, విజయసాయిరెడ్డి తమ వద్ద నుంచి సమాచారం దాస్తున్నందున వారిపై నార్కో అనాలిసిస్ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ కోరడం సుప్రీం తీర్పు ప్రకారం తమ బాధ్యతలను విస్మరించడమే. అంతేగాక, ఇది వారిరువురికి ఆర్టికల్ 20(3) ద్వారా సిద్ధించిన హక్కులకు ముమ్మాటికీ భంగం కలిగించడమే.

‘సత్యశోధన’ చెల్లదు!

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిపై మత్తుమందు ప్రయోగించి సమాచా రాన్ని సేకరించడం వ్యక్తిని ‘హింస’కు గురిచేయడమే. నేర పరిశోధనలో భాగంగా నిందితుడికి ఇంజక్షన్ ద్వారా నరాల్లోకి ‘సోడియం అమైటాల్’ను పంపించి మత్తు లోకి పంపిస్తారు. సీబీఐ గతంలో ఇంటరాగేషన్ నిమిత్తం నోయిడా మర్డర్ కేసులో, తెల్గీ కేసులో ‘ఇంట్రావీనస్ బార్బిచ్యురేట్స్’ ప్రయోగించి సమాచారాన్ని సేకరించింది. 

అయితే ఈ కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు ముందు విచారించినవి కావడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఇటు వంటి పరీలకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఈ పరీక్షలు అశాస్త్రీయమైనవని, పరీక్షకు గురైనవ్యక్తి పూర్తి నిజాలే వెల్లడిస్తాడని భావిం చలేమని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా ఈ పరీక్షలు నిర్వహిం చిన వ్యక్తి నుంచి సేకరించిన సమాచారాన్ని సాక్ష్యంగా పరిగణించలేమని ప్రకటిం చింది. అలాగే ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు కూడా తీవ్రవాదులపై ఈ పరీక్షలను జరపడం వారిని ‘హింస’కు గురిచేయడమేనని అభిప్రాయపడింది. పరీక్ష నిర్వహణకు వాడే రసాయనిక ఔషధం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మానసిక రుగ్మతలు, కాలే య సంబంధ వ్యాధులు ఈ ఔషధ వినియోగం వలన సంక్రమిస్తాయని వైద్య నిపు ణులు తేల్చి చెప్పారు.
Share this article :

0 comments: