'షర్మిల సవాల్ ను కేసీఆర్ స్వీకరించాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'షర్మిల సవాల్ ను కేసీఆర్ స్వీకరించాలి'

'షర్మిల సవాల్ ను కేసీఆర్ స్వీకరించాలి'

Written By news on Thursday, November 29, 2012 | 11/29/2012

వ్యక్తిగత ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు నల్లా సూర్యప్రకాశ్‌, రవీంద్రనాయక్‌లు అన్నారు. అవాకులు, చవాకులు పేలకుండా నోరు అదుపులో పెట్టుకోండని టీఆర్ఎస్ నేతల్ని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో ప్యాకేజీ కుదుర్చుకుని వైఎస్‌ఆర్‌ సీపీని విమర్శించడం తగదని అన్నారు. 2001లో మీకున్న ఆస్తులెంత.. ఇప్పుడు మీకున్న ఆస్తులెంత అని నల్లా సూర్యప్రకాశ్‌, రవీంద్రనాయక్‌లు ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆయన కుమార్తె కవితలు.. షర్మిల సవాల్‌ని స్వీకరించాలని రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు. 

source:sakshi
Share this article :

0 comments: