ఒక్క రూపాయి వాటా చూపగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఒక్క రూపాయి వాటా చూపగలరా?

ఒక్క రూపాయి వాటా చూపగలరా?

Written By news on Tuesday, November 27, 2012 | 11/27/2012

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు సమాదానం ఇచ్చారు. ఓబులాపురం, బయ్యారం గనులలో తనకు ఒక్క రూపాయి కూడా వాటాలేదని ఆమె ప్రకటించారు. గద్వాలలో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల సందోహం మధ్య ఆమె ప్రసంగించారు.తనకు వాటా లేదని నిరూపిస్తే మీరు క్షమాపణలు చెబుతారా? అని కెసిఆర్ ను షర్మిల ప్రశ్నించారు. మీకు ఒక కూతురు ఉంది, ఆమెపై అబాండాలు వేస్తే మీరు ఊరుకుంటారా? తనపై నిందలు ఎందుకు వేస్తున్నారు? అని ప్రశ్నించారు.ప్రజాసమస్యలపై టిఆర్ఎస్ ఎప్పుడైనా పోరాడిందా ? అని ప్రశ్నించారు. కేసిఆర్‌కు ప్రజాసమస్యలు పట్టవని విమర్శించారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20121127_19.php


Share this article :

0 comments: