సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్

సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్

Written By news on Tuesday, April 8, 2014 | 4/08/2014

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోనే షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మంగళవారం శ్రీనివాసులు ఆ పార్టీలో చేరారు.

చంద్రబాబును నమ్మి పూర్తిగా నష్టపోయామని శ్రీనివాసులు విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని అన్నారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం చాలా అవసరమని , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ అధికారంలోకి రావాలని శ్రీనివాసులు చెప్పారు
Share this article :

0 comments: