జననేతతో మబ్బు చెంగారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జననేతతో మబ్బు చెంగారెడ్డి

జననేతతో మబ్బు చెంగారెడ్డి

Written By news on Sunday, April 6, 2014 | 4/06/2014

జననేతతో మబ్బు చెంగారెడ్డి
  •     ఒకటి రెండు రోజుల్లో పార్టీలో చేరే అవకాశం
  •      మబ్బు వర్గీయుల్లో నూతనోత్తేజం
  •      వైఎస్‌ఆర్ సీపీ మరింత బలోపేతం
 తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: దివంగత మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఇద్దరూ కాసేపు చర్చించుకున్న అనంతరం మబ్బును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధానికి గుడ్‌బై చెబుతూ మబ్బు చెంగారెడ్డి హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవ డం ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుపతిలో మబ్బు ఇల్లు కాంగ్రెస్‌కు పుట్టినిల్లుగా ఆ పార్టీ నాయకులు భావిస్తుంటారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన మబ్బు రామిరెడ్డి కుటుంబానికి తిరుపతిలో బలమైన వర్గం ఉంది. రామిరెడ్డి మరణానంతరం ఆయన కొడుకు మబ్బు చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, ఐఎన్‌టీయూసీ నాయకునిగా పనిచేశారు. బలమైన నాయకుడిగా ఎదిగారు. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాల్లో ప్రభావం చూపే బలమైన సామాజిక వర్గంగా మబ్బు కుటుంబం ప్రతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక తీరు నచ్చక పార్టీకి గుడ్‌బై చెప్పి, ఐఎన్‌టీయూసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కాం ట్రాక్టర్ల అసోసియేషన్, ప్రయివేట్ లెక్చరర్ల అసోసియేషన్లకు గౌరవాధ్యక్షులుగా, టౌన్‌క్లబ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మబ్బు ప్రజా సంఘాల మద్దతుతో ఆరు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపారు.

సమైక్య పోరుకే మద్దతు

 
ఎన్నికల నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని చెంగారెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆయన ఇదివరకే బంధువులు, సన్నిహితులు, కార్మిక, ఉద్యోగ సంఘాలతో వారం క్రితం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటుచేసి, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలో శనివారం మబ్బు చెంగారెడ్డి తన సన్నిహితులతో కలసి హైదరాబాద్‌కు వెళ్లి వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఆయనతోపాటు అనుచరులు, బంధుగణం, ఉద్యోగ, కార్మిక, అనుబంధ సంఘా లు వైఎస్‌ఆర్‌సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.
 
Share this article :

0 comments: