వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం..

వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం..

Written By news on Friday, October 17, 2014 | 10/17/2014


వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం..
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని పది జిల్లాల్లో రెపరెపలాడిద్దాం. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చెద్దాం. ఈ రోజు నుంచి కసిగా పని చేద్దాం. నెంబర్ వన్ పార్టీ స్థాయికి తీసుకెళ్దాం. గతం వదిలెద్దాం. మనలో మనకు విమర్శలు వద్దు. పార్టీ పదవులు తీసుకొద్దాం. ప్రజలకు మద్దతుగా ఉద్యం మిద్దాం. వాటిని అలంకారప్రాయం కానివ్వకుండా పనిచేసుకెళ్దాం. పార్టీ పదవితో ప్రజలు గుర్తించే నాయకులుగా స్థిరపడదాం.

వరంగల్ గడ్డ నమ్మకానికి ప్రతిరూపం అని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. అది వమ్ముకాకుండా చూసుకొద్దాం. కష్టాల్లో ఉన్న ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి తమకు అండగా ఉందనే భరోసా నిద్దామని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ సీపీ సమావేశాలు జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి.

గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తొలిరోజు వరంగల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. దీనికి వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు జిల్లా నేతలు తమ అభిప్రాయాలను నిర్భయంగా నేతల ముందు ఉంచారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన సూచనల, ఆలోచన ప్రకారమే రాబోయే రోజుల్లో పార్టీ నడుచుకొంటుందన్నారు.

పార్టీలో పదవులు భర్తీ చేయక గుర్తింపులేదని భావించే పక్షంలో ఆ బాధలేకుండా చేస్తాం. త్వరలో జిల్లా పార్టీ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేస్తామన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలో ఎందుకు సక్సెస్ అయ్యాం. మిగతా తెలంగాణ జిల్లాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయాం ఆలోచించాలి. గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్నట్లేనని చెప్పారు.

ఖమ్మం జిల్లా పార్టీ చూచి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు కసిగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలు పట్టుదల పడితే సాధించలేనిది లేదన్నారు. గ్రామం సర్పంచ్‌గా గెలవాలంటే వార్డు మెంబర్‌గా గెలవాలి. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా నెగ్గితే ఎమ్మెల్యే స్థానం నెగ్గటం సులువు అని తెలిపారు. ఖమ్మం 206 గ్రామ పంచాయతీల్లో గెలిచాం. ఆ ప్రభావంతో ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలల్లో నెగ్గాం. జగనన్న ఎంత కష్ట పడిన గ్రామ స్థాయిలో కష్టపడే వ్యక్తులు లేనప్పుడు పార్టీ బిల్డప్ చేయటం కష్టమౌతుందని చెప్పారు.

దివంగత సీఎం వైఎస్సార్ పథకాలను ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటున్నారని తెలిపారు. ఆయన పాలనను నేటి పాలకుల పాలనతో పోల్చుకుంటున్నారని చెప్పారు. గ్రామీణ జనం వైఎస్సార్‌ని దేవుడిగా చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ పై జనంలో ఉన్న అభిమానం, ప్రేమ అందరం కలిసి సోమ్ము చేసుకుందామన్నారు. జిల్లాలోని మెజార్టీ  నియోజక వర్గాల్లో గెలుద్దామని చెప్పారు. పార్టీ కష్టపడే నాయకులది. నాయకులు కష్టపడితే పార్టీ అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు.

మనం మంచి పోరాటాలు చేసి ప్రజల మధ్యలో ఉంటే ఓటరు మంచిగా స్పందిస్తాడు. లక్షల మంది ఖమ్మం ప్రజల్లో నమ్మకాన్ని కల్గించాం. అందుకే నెగ్గామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యంతో ప్రజల్లో ముద్ర వేసుకోవటంతో అధికారంలోకి రాగలిగాడని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పదవులన్నింటి భర్తీ చేస్తామన్నారు. అవి అలంకారప్రాయం కాకుండా చూచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ అత్యంత బలం గా ఉంది. వరంగల్ జిల్లా పార్టీ కోహినూర్ వజ్రం లాగా తీర్చిదిద్దుదామని చెప్పారు.

మహబూబ్‌నగర్ నుంచే షర్మిల పరమార్శ యాత్ర చేస్తుందని తెలిపారు. తెలంగాణలో వైసీపీ లేదు అనే వారి ప్రచారాలను తిప్పికొడదామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని తెలి పారు. సమష్ఠిగా పని చేద్దామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేద్దామని తెలిపారు. విద్యుత్తు సమస్యతో పంటలు ఎండి ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతాంగానికి అండగా నిలుద్దామన్నారు.

మనస్సులో పార్టీ అభివృద్ధే ధ్యాసగా పెట్టుకోవాలని చెప్పారు. ఐక్యతో పని చేసి మహబూబ్‌నగర్ దెబ్బ ఇదని చూపిద్దామన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలు తీసుకొని ఎక్కడిక్కడ పని చేద్దామన్నారు. రాష్ట్ర పార్టీ అన్ని విధాలా అడ్డగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, రాజ్‌కుమార్ యాదవ్, విలియం, ఎన్ శాంతకుమార్, బంగిలాల్ నాయక్, రాజయ్య, శంకరాచారి, జె. మహేందర్ రెడ్డి, ఎ.కిషన్, వైసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: