కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు

కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు

Written By news on Sunday, November 23, 2014 | 11/23/2014


కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్  బాధితుల సహాయార్థం కువైట్‌లోని వైఎస్సార్ సీపీ గల్ఫ్ విభాగం తరపున రూ.4.7 లక్షల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందచేశారు. పార్టీ గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో   శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఈ మేరకు చెక్కును అందించారు.

కష్టాల్లో ఉన్న సాటి తెలుగువారిని ఆదుకునేందుకు కువైట్ తెలుగువారు స్పందించి విరాళాలు ఇచ్చినట్లు ఇలియాస్ తెలిపారు. వారి వితరణను జగన్ అభినందించారు. జగన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్‌బాష, మేయర్ సురేష్‌బాబు, కువైట్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్‌బాష, ఎస్.నజీర్, బాబు పాల్గొన్నారు.
Share this article :

0 comments: